పాపం.. మణిరత్నం సినిమా

మణిరత్నం అంటే నిజంగా డైరక్టర్లలో మణి..రత్నమే. కానీ పాపం, ఆయన సినిమా అంటే తెలుగునాట పట్టించుకునేవారు, దాని గురించి ఆలోచించేవారు కరువైపోయారు. రామ్ గోపాల్ వర్మ సినిమాల పరిస్థితిగా మారుతోంది నానాటికీ. మణిరత్నం నవాబ్…

మణిరత్నం అంటే నిజంగా డైరక్టర్లలో మణి..రత్నమే. కానీ పాపం, ఆయన సినిమా అంటే తెలుగునాట పట్టించుకునేవారు, దాని గురించి ఆలోచించేవారు కరువైపోయారు. రామ్ గోపాల్ వర్మ సినిమాల పరిస్థితిగా మారుతోంది నానాటికీ. మణిరత్నం నవాబ్ సినిమాకు తెలుగునాట వన్ పర్సంట్ బజ్ కూడా వున్నట్లు కనిపించడంలేదు. 

ఒకప్పుడు మణిరత్నం సినిమాలు అంటే తెలుగునాట భలే క్రేజ్ వుండేది. పోటీవుండేది. దానికి తగినట్లు ఓపెనింగ్స్ వుండేవి. ఇటీవల కాలంలో ఓకె బంగారం మినహా మరో సినిమా ఏదీ మణిరత్నం నుంచి వచ్చి ఓకె అనిపించుకున్న దాఖలాలు లేవు. ఆఖరున వచ్చిన చెలియా వ్యవహారం కూడా అంతే.

సినిమా సినిమాకు బయ్యర్లు మారుతూ వస్తున్నారు. సేమ్ టు సేమ్ రామ్ గోపాల్ వర్మ సినిమాల మాదిరిగానే. లేటెస్ట్ గా నవాబ్ అంటూ అందిస్తున్నాడు మణిరత్నం. అటు దేవదాస్ లాంటి క్రేజీ ప్రాజెక్టు మీద వస్తోంది ఈ సినిమా. దాంతో జనాల దృష్టి అంతా అటే వుంది తప్ప ఇటు కనిపించడం లేదు. 

ముఖ్యంగా నవాబ్ అన్న టైటిల్ జనాలకు సినిమాను చేర్చడంలో కాస్త ఇబ్బందిగా మారిందని ఇండస్ట్రీ జనాల టాక్. సినిమా విడుదలయిన తరువాత మౌత్ టాక్ మాత్రమే నవాబ్ సినిమాకు రక్ష. మౌత్ టాక్ బాగుంటే తెలుగునాట ఏ సినిమాను ఆపలేరు. అది బిచ్చగాడు అయినా నవాబ్ అయినా.