ఎన్టీఆర్ బయోపిక్ మార్కెటింగ్ వ్యవహారాలు స్పీడ్ అందుకున్నాయి. బయోపిక్ నిర్మాతల్లో ఒకరు అయిన సాయి కొర్రపాటి కృష్ణా, వైజాగ్, కర్ణాటక హక్కులు తనకు ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు లేటెస్ట్ గా నైజాం ఏరియా హక్కులు ఏషియన్ సునీల్ కు ఫైనల్ చేసినట్లు తెలిసింది. అయితే సునీల్ సహజంగా సినిమాలు పంపిణీ చేస్తారు తప్ప కొనరు.. మరి బయోపిక్ విషయంలో ఏమి జరిగింది.. ఒప్పందం ఏమిటి అన్నది ఇంకా బయటకురాలేదు.
బాలయ్యతో సునీల్ కు ఉన్న అనుబంధం రీత్యా బహుశా పంపిణీకి ఇచ్చి ఉండొచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉంటె మిగిలిన ఏరియాల చర్చలు కూడా సాగుతున్నాయని తెలుస్తోంది ఎన్టీఆర్ బియోపిక్ కి ఇటీవల మంచి క్రేజ్ వచ్చింది.
ఎన్టీఆర్.. చంద్రబాబు.. ఏఎన్నార్ ల లుక్ లు వచ్చిన తర్వాత సినిమా మీద కాస్త ఆసక్తి పెరిగింది. దీంతో ఇప్పుడు బిజినెస్ క్లోజ్ చేసే పనిలో యూనిట్ బిజీగా ఉంది.