కేరళను అనుసరించాల్సిందేనా?

కేరళ ప్రభుత్వం అయిదు రోజుల కిందట ఓ నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో ఇకమీదట బాటిల్డ్ నీళ్లను రూ.13 కు మించి అమ్మడానికి వీల్లేదు. పెద్ద కంపెనీలు అయినా, లోకల్ కంపెనీలు అయినా.. ప్యాక్…

కేరళ ప్రభుత్వం అయిదు రోజుల కిందట ఓ నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో ఇకమీదట బాటిల్డ్ నీళ్లను రూ.13 కు మించి అమ్మడానికి వీల్లేదు. పెద్ద కంపెనీలు అయినా, లోకల్ కంపెనీలు అయినా.. ప్యాక్ చేసిన తాగునీటిని ఒక లీటరు రూ.13కు మించి అమ్మడానికి వీల్లేదంటూ ప్రభుత్వం ఉత్తర్వులు తెచ్చింది. తాగునీటిని నిత్యావసరాల కిందికి తెస్తూ.. ఈ నిబంధన విధించింది. అలాగే.. విక్రయించే నీటిని బీఐఎస్ ప్రమాణాల ప్రకారం విధిగా ఉండేలా నిబంధనలు విధించారు.

కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. పెద్ద కంపెనీలు విక్రయించే తాగునీటిని లీటరు రూ.20 వంతున అమ్ముతున్నారు. కేరళ ప్రభుత్వం ధరలు తగ్గించడంతో.. ఇతర రాష్ట్రాలు కూడా… ఇలాంటి నిబంధన విధించే అవకాశం ఉంది. అదే సమయంలో నీటిని విక్రయించే కంపెనీల మీద ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే ధరకు విక్రయించాలనే నైతిక ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంది.

నిజానికి కేరళ టూరిజం ప్రధానంగా ఉండే రాష్ట్రాల్లో ఒకటి. ఆ రాష్ట్రంలో ప్రజల ప్రధాన ఆదాయ వనరు కూడా టూరిజమే. టూరిస్టులు విపరీతంగా వస్తుండే కేరళలో బాటిల్డ్ నీళ్లు అందుబాటు ధరలో ఉండడం అనేది ఎంతో మంచి విషయం. ప్రభుత్వానికి ఈ విషయంలో బాగానే మార్కులు పడే అవకాశం ఉంది.

నిజానికి ఈ నిర్ణయాన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం ముసుగులో ఓట్లు కురిపించే పథకాలకు వేలాది కోట్ల రూపాయలు అప్పనంగా ఖర్చు పెడుతున్నాయి. ఇలాంటి పథకాల విషయంలో ఒకరిని చూసి మరొకరు.. అన్ని రాష్ట్రాలూ అనుసరిస్తూ పోతున్నాయి. అలాంటిది.. ఓట్లతో నిమిత్తం లేకపోయినప్పటికీ.. వాస్తవంగా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండే.. ఇలాంటి నిర్ణయాన్ని అందరూ అనుసరిస్తే ఎంతో బాగుంటుంది. లేదా, కేరళలో విధిగా ధర తగ్గించి విక్రయిస్తారు గనుక.. పెద్ద పెద్ద కంపెనీల వాళ్లయినా.. స్వచ్ఛందంగానే ఇతర రాష్ట్రాల్లో ధర తగ్గించడాన్ని అమల్లోకి తెస్తే కూడా బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.

ఏ జోనర్ చేసినా ఫ్లాపులు పలకరించాయి