దిల్ రాజు ప్లాన్ బి

ఎఫ్ 3 సినిమా అన్నది నిర్మాత దిల్ రాజు-డైరక్టర్ అనిల్ రావిపూడి ల డ్రీమ్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులోకి మహేష్ ను కూడా తీసుకోవాలని అనుకోవడం, ఈ విషయం ఆయనకు చెప్పడం, తన కన్సెంట్…

ఎఫ్ 3 సినిమా అన్నది నిర్మాత దిల్ రాజు-డైరక్టర్ అనిల్ రావిపూడి ల డ్రీమ్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులోకి మహేష్ ను కూడా తీసుకోవాలని అనుకోవడం, ఈ విషయం ఆయనకు చెప్పడం, తన కన్సెంట్ ఇవ్వడం వరకు అయిపోయింది. విక్టరీ  వెంకటేష్ రెమ్యూనిరేషన్ దగ్గర సినిమా ఆగడం, మహేష్ తో మల్టీ స్టారర్ అనేసరికి వేరే విధంగా ప్రయాణించడం వంటి వ్యవహారాలు జరిగాయి. ఇలాంటి టైమ్ లో ప్లాన్ బి ను కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది.

మహేష్ ను తీసుకుంటే బడ్జెట్ చాలా పెరుగుతుంది. ముగ్గురు హీరోల మీద ఖర్చు ఏ మేరకు పెరుగుతుంది. ఏ మేరకు రెవెన్యూ పెరుగుతుంది. అదే విధంగా సినిమా ను సంక్రాంతి 2021 కి విడుదల చేయడం సాధ్యం అవుతుందా? అన్న లెక్కలు కడుతున్నారని బోగట్టా.

అందుకే ఎఫ్ 3 అని పేరు పెట్టినా ఇద్దరు హీరోలతో వెళ్లడం, అస్సలు మూడో హీరో అన్న పాయింట్ లేకుండా తీయడం అన్నది ఆ ప్లాన్ బి అని తెలుస్తోంది. ఈ రెండు రకాల ప్లాన్ ల మీద ఇప్పుడు అనిల్ రావిపూడి వర్కవుట్ చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఏది ఏమైనా సినిమాను సంక్రాంతి 2021 కు తీసుకురావాలనే ఐడియా దిల్ రాజు లో వుంది.

సో, ప్లాన్ ఎ నా? ప్లాన్ బి నా? అన్నది కొద్ది రోజుల్లో డిసైడ్ చేసి, అఫీషియల్ గా ప్రకటన ఇచ్చే ఆలోచనలో దిల్ రాజు వున్నట్లు బోగట్టా.

ఏ జోనర్ చేసినా ఫ్లాపులు పలకరించాయి