సాధారణంగా ప్రయివేట్ సంస్థల్లో దసరా, దీపావళి వస్తే సరదా. బోనస్ లు, స్వీట్ బాక్స్ లు, హంగామా వుంటుంది. కానీ ఈసారి అల్లు అరవింద్ గీతా సంస్థకు దసరా, దీపావళి ముందే వచ్చేసాయి. గీతగోవిందం సినిమా హిట్ కొట్టడంతో, సిబ్బందిని కూడా ఆనందంలో భాగం చేసేసారు.
దాదాపు అందరికీ రెండు మూడునెలల బోనస్ ప్రకటించినట్లు తెలుస్తోంది. అలాగే బంగారు గొలుసులు లాంటి బహుమతులు కూడా ఇవ్వబోతున్నారు. సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరిని, వారి వారి లెవెల్స్ కు తగినట్లు ఆనందపరిచే కార్యక్రమం జరుగుతోందని తెలుస్తోంది.
గీత గోవిందం సినిమాను ఆంధ్ర, సీడెడ్, నైజాంల్లో ఒక్క విశాఖ, నెల్లూరు తప్ప మిగిలిన చోట్ల అంతా స్వంత డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నారు. దాదాపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో యాభైకోట్ల షేర్ వచ్చింది. అందువల్ల ఇబ్బడి ముబ్బడిగా లాభాలు వచ్చాయి. ఈ ఆనందం స్టాఫ్ తో కూడా పంచుకోవాలని అరవింద్ ఆదేశించడం, బన్నీ వాస్ పాటించడం జరిగిపోయినట్లు తెలుస్తోంది.