గీతగోవిందం.. పరుశురామ్.. పది కోట్లు

పదికోట్లు రెమ్యూనిరేషన్ అంటే టాలీవుడ్ లో చిన్న విషయంకాదు. ముఖ్యంగా దర్శకులకు. టాప్ డైరక్టర్లు తప్ప వేరెవరు అంత ఫిగర్ కళ్లచూడరు. అలాంటిది సోలో, శ్రీరస్తు-శుభమస్తు లాంటి చిన్న సినిమాలు చేసిన పరుశురామ్, కేవలం…

పదికోట్లు రెమ్యూనిరేషన్ అంటే టాలీవుడ్ లో చిన్న విషయంకాదు. ముఖ్యంగా దర్శకులకు. టాప్ డైరక్టర్లు తప్ప వేరెవరు అంత ఫిగర్ కళ్లచూడరు. అలాంటిది సోలో, శ్రీరస్తు-శుభమస్తు లాంటి చిన్న సినిమాలు చేసిన పరుశురామ్, కేవలం ప్రొడ్యూసర్ ముందు జాగ్రత్త వల్ల, అదృష్టం గాడిద తన్ను తన్నినట్లు తన్నేసింది. 

చిన్న డైరక్టర్, చిన్న సినిమా అని అల్లు అరవింద్, లాభాల్లో వాటా అన్నారు. అలా అంటే మరింత జాగ్రత్తగా తీస్తారు. పెద్దగా ఇవ్వాల్సి వుండకపోవచ్చు అనుకుని వుంటారు. కానీ ఇప్పుడు అదే పరుశురామ్ కు కాసుల పంట పండించింది. అయితే ఇక్కడ అల్లు అరవింద్ ను కూడా మెచ్చుకోవాలి. 

సినిమా ఇంక విడుదల అవుతుంది అనగా, రెండో, మూడో ఇచ్చి సెటిల్ చేసేసుకోవచ్చు కదా డైరక్టర్ కు అన్న సలహాలు ఆయనకు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ మాట ఇచ్చాక అలాగే వుండాలి అని ఆయన అలా వుండిపోయారు. దాంతో ఇప్పుడు నాలుగు వారాల ఫైనల్ లెక్కలు తేల్చేసరికి డైరక్టర్ పరుశురామ్ వాటాకు తొమ్మిది కోట్లకు పైగా ఇవ్వాలని లెక్క తేలిందట.

అల్లు అరవింద్ టోటల్ రౌండ్ చేసి 10 కోట్లు ఇవ్వాలని డిసైడ్ చేసారట. ఇప్పటికి ఆరుకోట్ల వరకు ఇచ్చేసినట్లు కూడా తెలుస్తోంది. పరుశురామ్ తన తరువాత సినిమా కూడా గీతాఆర్ట్స్ లోనే చేయబోతున్న సంగతి తెలిసిందే.