సుకుమార్ రైటింగ్స్ మరో ప్రాజెక్టు

మైత్రీ మూవీస్-మహేష్ బాబు సినిమా ప్రాజెక్టు స్టార్ట్ కావడానికి ఇంకా చాలా టైమ్ వుంది. ఈలోగా దర్శకుడు సుకుమార్ చకచకా చిన్న ప్రాజెక్టులు రెడీ చేసేస్తున్నారు. తన సూపర్ వైజన్ లో, తన లైన్,…

మైత్రీ మూవీస్-మహేష్ బాబు సినిమా ప్రాజెక్టు స్టార్ట్ కావడానికి ఇంకా చాలా టైమ్ వుంది. ఈలోగా దర్శకుడు సుకుమార్ చకచకా చిన్న ప్రాజెక్టులు రెడీ చేసేస్తున్నారు. తన సూపర్ వైజన్ లో, తన లైన్, కథ కథనాలతో తన అసిస్టెంట్ లో పలు ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే మైత్రీలో ఇలా ఒకటి ప్లాన్ చేసి వుంచారు. దాంట్లో సాయిధరమ్ తేజ్ సోదరుడు హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఆ విషయం ఎప్పుడో వెల్లడించాం. ఇప్పుడు మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. తనకు ఆర్య లాంటి హిట్ లు ఇచ్చిన గీతాఆర్ట్స్ లో, గీతా 2 బ్యానర్ లో ఓ సినిమాకు మాంచి కథ రెడీ చేసినట్లు తెలుస్తోంది.

ఈ కథను, కుమారి 21ఎఫ్ అందించిన ప్రతాప్ డైరక్ట్ చేస్తారు. స్టార్ కాస్ట్ మీద డిస్కషన్లు నడుస్తున్నాయి. కథ ప్రకారం కాస్త అగ్రెసివ్ యంగ్ హీరో అయితే బాగుంటుంది. కానీ ఎవ్వరూ ఖాళీ లేరు. అందుకోసం ఎవరైతే బాగుంటుందా అన్న డిస్కషన్లు సాగుతున్నాయి.