నోటా డబ్బింగ్ స్టార్ట్స్ నౌ?

గత వారం రోజులుగా విడుదల డేట్ మీద కిందామీదా అవుతోంది విజయ్ దేవరకొండ నోటా సినిమా. అయిదునా? 18నా? అంటూ. ఆఖరికి అయిదునే అంటూ నిన్నే వెల్లడించాం. అయితే ఇక్కడ ఇంకో చిన్న ట్విస్ట్…

గత వారం రోజులుగా విడుదల డేట్ మీద కిందామీదా అవుతోంది విజయ్ దేవరకొండ నోటా సినిమా. అయిదునా? 18నా? అంటూ. ఆఖరికి అయిదునే అంటూ నిన్నే వెల్లడించాం. అయితే ఇక్కడ ఇంకో చిన్న ట్విస్ట్ దాగి వుందని తెలుస్తోంది. ఈ సినిమాకు హీరో డబ్బింగ్ ఇంకా చెప్పలేదని వినిపిస్తోంది.

హీరో విజయ్ దేవరకొండ తన పర్సనల్ పనుల్లో బిజీగా వుండడం, అతని తల్లికి ఆరోగ్యం కాస్త బాగులేకపోవడం వంటి కారణాలతో డబ్బింగ్ పూర్తి చేయలేదని తెలుస్తోంది. విడుదల డేట్ మీద దిల్ రాజు, యువి వంశీ, నిర్మాత జ్ఞాన్ వేల్ రాజా మీటింగ్ లు పెట్టినపుడు, ఫైనల్ మీటింగ్ కు విజయ్ ను కూడా పిలిచారని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. 

సినిమా విడుదల అయిదవ తేదీ అనివార్యం అని, మరో అవకాశం లేదని, లేదూ అంటే డిసెంబర్ కు వెళ్లిపోవాల్సిందే అని క్లియర్ చేసి, ఏదో విధంగా త్వరగా డబ్బింగ్ ఫినిష్ చేయమని కోరినట్లు తెలుస్తోంది. దానికి విజయ్ దేవరకొండ సరే అన్నట్లు తెలుస్తోంది.

అనుభవం వున్న హీరోలు, నటులు ఎవరైనా డబ్బింగ్ చకచకా చెప్పేస్తారు. రొటీన్ సీన్లు అయితే ఒక్క రోజులో కాస్త డెప్త్, ఎమోషన్ వుంటే మహా అయితే మూడు రోజుల్లో ఫినిష్ చేసేస్తారు. అందువల్ల ఈ వారంలో డబ్బింగ్ ఫినిష్ చేసే అవకాశం వుంది.