త్రివిక్రమ్-ఎన్టీఆర్-థమన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అరవింద సమేత వీర రాఘవ. ఈ సినిమాలో ఓ పాట ఇప్పటికే విడుదలయింది. జనాలను బాగానే ఆకట్టకుంది. మరో రెండు పాటలు మరో రెండు రోజుల్లో ఆన్ లైన్ లోకి రాబోతున్నాయి. టోటల్ ఆడియో 20న ఆన్ లైన్ లోకి వస్తుంది.
ఇదిలా వుంటే సినిమా మొత్తం మీద నాలుగే పాటలు వుంటాయని తెలుస్తోంది. హీరో సోలో సాంగ్, రెండు డ్యూయట్లు పక్కా అని తెలుస్తోంది. ఆ రెండు డ్యూయట్లే ఇప్పుడు అన్నపూర్ణలో సెట్ వేసి చిత్రీకరిస్తున్నారు. ఇవి ఓ పాట కేవలం ఆర్ ఆర్ గా వుంటుందట. అంటే సినిమా పొడవునా, అప్పుడప్పుడు నేపథ్యసంగీతానికి బదులు, పాటగా వినిపిస్తూ వుంటుందన్నమాట బ్యాక్ గ్రవుండ్ లో.
అరవింద సమేత వర్క్ దాదాపు పూర్తి కావస్తోంది. అన్నీ పనులు పూర్తి చేసుకుని అక్టోబర్ విడుదల దిశగా రెడీ అవుతోంది. ఎక్కడా టైమ్ వేస్ట్ కాకూడదనే విదేశాల్లో చేద్దామనుకున్న పాటను కూడా తాత్కాలికంగా పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది.