శైలజారెడ్డి అల్లుడు పెద్ద లక్కీ ఫ్యాక్టర్ ఏమిటంటే, వినాయక చవితికి విడుదల కావడం. దానివల్ల మిక్స్ డ్ సమీక్షలతో సంబంధం లేకుండా మంచి కలెక్షన్లు తొలిరోజే నమోదు చేసింది. తొలిరోజే దాదాపు అయిదున్నర కోట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో నమోదు చేసింది ఈ సినిమా.
రెండో రోజు రెండు కోట్లకు పైగా యాడ్ చేసుకుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో, రెండు రోజులకు కలిపి 7.71 కోట్ల షేర్ నమోదు చేసింది. ఇక ఫస్ట్ వీకెండ్ కు రెండు రోజులు వుంది. శనివారం, ఆదివారం. ఈ రెండు రోజులు హాలీడేస్ కాబట్టి సహజంగానే బాగానే వుంటుంది.
అందువల్ల శని, ఆదివారాలతో కలిపి తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లు దాటేసే అవకాశం క్లియర్ గా వుంది. ఈ సినిమా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలిపి 18.40 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. అంటే ఫస్ట్ వీకెండ్ బిజినెస్ షేర్ పోతే మరో ఏడెనిమిది కోట్లు వసూలు చేస్తే, బ్రేక్ ఈవెన్ అయిపోయినట్లే. పైగా ఇంకో అడ్వాంటేజ్ ఏమిటంటే, ఈస్ట్ గోదావరి 1.45 కు వాల్యూ కట్టి నిర్మాతలు, వారి సన్నిహితులు తీసుకున్నారు. ఫస్ట్ వీకెండ్ లోనే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే తొలి రెండు రోజుల్లోనే కోటికి దగ్గరగా షేర్ వచ్చింది.
అలాగే కృష్ణ, వెస్ట్ కలిపి దర్శకుడు మారుతి, యువి వంశీ జాయింట్ గా తీసుకున్నారు. అది రెండున్నర కోట్లకు కాస్త అటుగా. ఇప్పటికి ఆ రెండు ఏరియాలు కలిపి షేర్ కోటి రూపాయలు వచ్చింది. శని, ఆదివారం కలిపి మరో 50 యాడ్ చేసుకున్నా, ఇంకో కోటి రూపాయలు ఫుల్ రన్ లో రావాలి.
నైజాంలో దిల్ రాజు కాస్త ఎక్కువకే తీసుకున్నారు. ఆరున్నర కోట్ల వరకు అని తెలుస్తోంది. ఇక్కడ మాత్రం సినిమా అయిదుకోట్ల వరకు లాంగ్ రన్ లో వసూలు చేసే అవకాశం వుందని అంచనా వేస్తున్నారు. ఇది మండే నాటి కలెక్షన్ చూసి డిసైడ్ అవుతుంది.
టోటల్ గా చూసుకుంటే సినిమాకు లాంగ్ రన్ లో ఒక్క నైజాంలో మాత్రమే ఏదైనా సమస్య రావచ్చని, ఇంక ఏరియాతోనూ సమస్య వుండదని ట్రేడ్ జనాలు లెక్కలు కడుతున్నారు.
రెండో రోజులు కలిపి కలెక్షన్లు
నైజాం……..2.38
సీడెడ్,,,,,,,.1.25
ఉత్తరాంధ్ర…0.88
ఈస్ట్……….0.97
వెస్ట్………..0.55
కృష్ణ………..0.56
గుంటూరు….0.79
నెల్లూరు…….0.33