చైతూ ఈ తేడా గమనించావా?

సరైన హిట్ లేక కిందామీదా అవుతున్నాడు హీరో నాగచైతన్య. అలాంటి టైమ్ లో శైలజారెడ్డి అల్లుడు సినిమా విడుదలయింది. మిక్స్ డ్ టాక్ సంగతి అలా వుంచితే చైతన్య కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్…

సరైన హిట్ లేక కిందామీదా అవుతున్నాడు హీరో నాగచైతన్య. అలాంటి టైమ్ లో శైలజారెడ్డి అల్లుడు సినిమా విడుదలయింది. మిక్స్ డ్ టాక్ సంగతి అలా వుంచితే చైతన్య కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అయిదున్నర కోట్లకు పైగా ఓపెనింగ్స్ వచ్చాయి. చిత్రమేమిటంటే చైతన్య లాస్ట్ సినిమా యుద్ధం శరణం సినిమాకు తొలిరోజు గట్టిగా రెండుకోట్లు కూడా వసూళ్లు రాలేదు. ఎందుకిలా జరిగిందని అప్పట్లో ఇండస్ట్రీ జనాలు బుర్రలు బద్దలుకొట్టుకున్నారు. ఫలితం తరువాత సంగతి వేరు. ఎందుకు ఓపెనింగ్స్ లేవు అని కిందామీదా అయ్యారు.

ఆ సినిమాను కొత్త డైరక్టర్ తో చేసాడు చైతన్య. అదీకాక, చైతన్యకు అస్సలు అచ్చిరాని యాక్షన్ జోనర్ కూడా. అదే శైలజారెడ్డి అల్లుడుకు మారుతి లాంటి ఎస్టాబ్లిష్ డైరక్టర్ తోడయ్యారు. ఫ్యామిలీ జోనర్ ప్లస్ అయింది. దాంతో ఓపెనింగ్స్ అయితే కుమ్మేసాయి. దీనికితోడు శనివారం కూడా సినిమా ఓపెనింగ్, బుకింగ్ లు ఫుల్ గా వుండడం విశేషం. 

దీన్నిబట్టి చైతన్య బలం యూత్ అండ్ ఫ్యామిలీ జోనర్ అని, ఎస్టాబ్లిష్ డైరక్టర్ వుండాలని మరోసారి క్లియర్ అయింది. కానీ పాపం, చైతూకి యాక్షన్ జోనర్లు అంటేనే ఇష్టం. శైలజారెడ్డి అల్లుడు తొలిరోజు వసూళ్లు ఇలా వున్నాయి.

నైజాం………….1.65
సీడెడ్………….0.81
ఉత్తరాంధ్ర..,…..0.60
ఈస్ట్……………0.72
వెస్ట్……………..0.41
కృష్ణ…………….0.40
గుంటూరు……..0.59
నెల్లూరు………..0.23