అమరావతి దేవేంద్రుడు పాలించిన నగరం. అది దేవతలు దీవించిన ప్రదేశం. బుద్దుడు నడయాడిన నేల ఇలా ఎన్నో కధలూ, పురణాలు వండివార్చారు పసుపు తమ్ముళ్ళు. తీరా చూస్తే అమరావతిలో ఏ దేవుడు శపించాడో కానీ గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ చిత్తు అయింది.
నిజానికి అమరావతి ఉన్న ప్రదేశం వేరు, అమరేశ్వరుని కోవెల ఉన్న చోటకూ రాజధాని ప్రాంతానికి అసలు సంబంధం లేదంటారు. అమరేశ్వరుడి ఆలయ అభివ్రుధ్ధికి గత సర్కార్ ఏం చేసిందో కూడా ఎవరికీ తెలియదు, కానీ అన్న నందమూరి అన్నట్లుగా ఆయన పెట్టిన పార్టీ వారే చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకున్నారు.
ఇపుడు అమరావతి రాజధాని ఉండాలి. విశాఖలో రాజధాని రాకూడదు, దాంతో నిన్నటి వరరకూ విశాఖ విషయంలో నిండుగా విషం చిమ్మిన తమ్ముళ్ళు ఇపుడు రూట్ మార్చారు. విశాఖను ఏకంగా దేవ భూమితో పోల్చుతున్నారు.
విశాఖ పవిత్రమైన ప్రదేశం, ఇక్కడ మహనీయులు నడయాడారు, చాల మంచి నేల. ఇక్కడ రాజధాని పెట్టడమేంటని టీడీపీ తమ్ముడు బాబూ రాజేంద్రప్రసాద్ కొత్త పల్లవి అందుకున్నారు. రాజధాని పెడితే రాజకీయ కాలుష్యం వస్తుందంట. దాంతో దేవ భూమి అపవిత్రం అయిపోతుదట. ఇది రాజేంద్రప్రసాద్ వారి తర్కం.
మరి దేవ భూమి అయితే ఇక్కడ టీడీపీ రాజకీయాలు చేయడం ఎందుకు, ఓట్లూ సీట్లు ఇక్కడ నుంచి పట్టుకెళ్ళడం ఎందుకు. ఎంచక్కా ఎన్నికలు పెట్టడం మానేసి ఏ కుళ్ళూ కుతంత్రం లేని విధంగా విశాఖను తయారుచేయొచ్చుగా.
అంటే ఇక్కడ నుంచి తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలవాలి. షరా మామూలు రాజకీయాలు సవ్యంగా సాగిపోవాలి. రాజధాని మాత్రం విశాఖకు వద్దు. పెడితే మాత్రం ఎక్కడ లేని కాలుష్యం తన్నుకుని వచ్చేస్తుందట. గొప్ప లాజిక్కే తమ్ముడిది అంటున్నారు విశాఖ జనం.