పవన్ కళ్యాణ్ తో క్రిష్ చేస్తున్న సినిమా ఓ షెడ్యూలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్న క్వశ్చను అలాగే వుంది. క్రిష్ ఆస్థాన హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ పేరు వినిపించింది కానీ, ఆమె మెయిన్ హీరోయిన్ కాకపోవచ్చు అనే వార్తలు కూడా వచ్చాయి. లేటెస్ట్ గా మరో రెండు కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. రెండూ బాలీవుడ్ పేర్లు కావడం విశేషం.
సాహో లో బ్యాడ్ బాయిస్ ఐటమ్ సాంగ్ లో తళుక్కున మెరిసిన జాక్విలిన్ ఫెర్నాండెస్ పేరు ఒకటి వినిపిస్తోంది. బాలీవుడ్ లో క్రిష్ కు చాలా పరిచయాలు వున్నాయి. అందువల్ల ఆమెను తెలుగులో హీరోయిన్ గా తీసుకురావడం ఆయనకు పెద్ద కష్టం కాకపోవచ్చు.
అలాగే తెలుగు సినిమాతోనే పరిచయమై బాలీవుడ్ కు వెళ్లిన దిశాపటానీ పేరు కూడా వినిపిస్తోంది. ఆమె పవన్ కు ఓకే కావాలే కానీ దిశా ఓకె అనడానికి సమస్య వుండకపోవచ్చు. మరి వినిపిస్తున్న రెండు పేర్లు ఓకె అవుతాయా?లేక మరో పేరు ఎంటర్ అవుతుందా సీన్లోకి చూడాలి.