ష‌కీలా కంటి చూపు నుంచి త‌ప్పించుకున్న స్టైలిష్ స్టార్‌

తార‌లెంద‌రున్నా శృంగార తార ష‌కీలాకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ వేరు. సినిమా రంగంలోకి అనేక మంది తార‌లు రావ‌డం, త‌ళుక్కుమ‌ని మెర‌వ‌డం, తిరిగి క‌నిపించ‌క‌పోవ‌డం చాలా స‌హ‌జ‌మైన విష‌య‌మే. కానీ ష‌కీలా అందుకు భిన్నం. శృంగార…

తార‌లెంద‌రున్నా శృంగార తార ష‌కీలాకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ వేరు. సినిమా రంగంలోకి అనేక మంది తార‌లు రావ‌డం, త‌ళుక్కుమ‌ని మెర‌వ‌డం, తిరిగి క‌నిపించ‌క‌పోవ‌డం చాలా స‌హ‌జ‌మైన విష‌య‌మే. కానీ ష‌కీలా అందుకు భిన్నం. శృంగార తార‌గా ఒన్ అండ్ ఓన్లీ న‌టి ఆమె. ఆమె త‌ర్వాతే ఎవ‌రైనా, ఏమైనా.

అలాంటి శృంగార తార‌కు టాలీవుడ్ స్టైలీస్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బ‌న్నీ అంటే ఎవ‌రో తెలియ‌దట‌. ఈ విష‌యాన్ని ఆమె ఓ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పారు. టాలీవుడ్ హీరోల‌ గురించి ఆమెను ప్ర‌శ్నించగా ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పారు.

టాల్‌వుడ్ హ్యాండ్స‌మ్ హీరో మ‌హేశ్‌బాబు త‌న‌కు సోద‌రుడి లాంటి వాడ‌ని చెప్పి ఆమె ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అలాగే జూనియ‌ర్ ఎన్టీఆర్ మంచి డ్యాన్స‌ర్ అని ష‌కీలా ప్ర‌శంసించారు. దీంతో జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవ‌ధుల్లేవు.

చివ‌రిగా బ‌న్నీఅంటే ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పి ఆశ్చ‌ర్య‌ప‌రిచారామె. ష‌కీలా స‌మాధానం విన్న బ‌న్నీ అభిమానుల‌కు చిర్రెత్తుకొచ్చింది. త‌మ అభిమాన హీరో గురించి ష‌కీలాకు తెలిస్తేనే ప్ర‌మాద‌మ‌ని, తెలియ‌క‌పోతే ఆశ్చ‌ర్యం ఏంట‌ని వారు సెటైర్లు వేస్తున్నారు. అయితే ష‌కీలా త‌న‌కు తెలిసిన విష‌యాల‌ను నిజాయితీగా చెప్పార‌ని అన్న‌వాళ్లు లేక‌పోలేదు. మ‌రికొంద‌రు బ‌న్నీ అభిమానులు మాత్రం ‘హ‌మ్మ‌య్యా  ష‌కీలా కంటి చూపులో మా హీరో ప‌డలేదులే’ అని అన‌డం గ‌మ‌నార్హం.

 నా కెరీర్‌లో ‘జాను’ గుర్తుండిపోయే సినిమా.