నేర విశాఖ.. ఘోర విశాఖ…?

అవునా. ప్రశాంత విశాఖ ఇలా మారిపోయిందా. ఎందుకలా. అంటే టీడీపీ ప్రెసిడెంట్ చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ తో  విశాఖకు ఈ కొత్త బిరుదులు వచ్చేశాయి అనుకోవాలి. Advertisement వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖ ఇలా…

అవునా. ప్రశాంత విశాఖ ఇలా మారిపోయిందా. ఎందుకలా. అంటే టీడీపీ ప్రెసిడెంట్ చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ తో  విశాఖకు ఈ కొత్త బిరుదులు వచ్చేశాయి అనుకోవాలి.

వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖ ఇలా మారిపోయిందంట. విశాఖలో మంచి వాళ్ళు ఇంతవరకూ ఉండేవారు, ఇపుడు అంతా నేరగాళ్ళ పాలు అయిపోయిందని బాబు తెగ ఫీల్ అవుతున్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తే విశాఖ పరిస్థితి  మరింత దారుణంగా మారుతుందట. 

విశాఖను కూడా ఏకంగా వైసీపీ పెద్దలు అమ్మేస్తారుట. ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదుట. ఆడబిడ్డలకు అసలు భద్రత ఉండదట. చంద్రబాబు ఎన్నికల ప్రచారం ఇలా సాగిపోయింది. పోనీ బాబు అనుకుంటున్నట్లుగా విశాఖ మీద అలా అధికార పార్టీ ప్రతాపం ఈ స్థాయిలో  చూపితే ఒక్క  జీవీఎంసీ ఎన్నికలతో ఏపీలో సర్కార్ మారిపోతుందా. 

లేక జీవీఎంసీ ఏపీలో లేకుడా వేరే ఎక్కడైనా ఉందా. ప్రత్యేకించి జీవీఎంసీకి రాష్ట్ర ప్రభుత్వానికి మించి అధికారాలు ఉన్నాయా. ఇలా లాజిక్ మరచి చంద్రబాబు వైసీపీ మీద ఆడిపోసుకొవడాన్ని వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. 

విశాఖను భూ కబ్జాల నగరంగా చేసిన ఘనత బాబుదేనని కూడా అంటున్నారు. ఇపుడు జనాలను భయపెట్టేలా చంద్రబాబు మాట్లాడుతున్న తీరు బాధాకరమని కూడా విమర్శిస్తున్నారు. ఎవరేం అన్నా కూడా చంద్రబాబు తన రొడ్డకొట్టుడు స్పీచ్ తో విశాఖ అంతా తిరిగి వైసీపీకి ఓటేయవద్దు అంటూ వేడుకున్నారు.

కాజల్‌. సునీల్‌ శెట్టిగారికి కథ చెప్పగానే ఒప్పుకున్నారు

లోకేశ్ ప్ర‌తిమాట ఆణిముత్య‌మే