సైడ్ బిజినెస్ స్టార్ట్ చేసిన హీరోయిన్

నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకొని సెటిలైన ప్రియాంక చోప్రా, ఇప్పుడో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. న్యూయార్క్ లో సోనా పేరిట ఇండియన్ రెస్టారెంట్ ను ఓపెన్ చేయబోతోంది. ప్రస్తుతం ఈ రెస్టారెంట్…

నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకొని సెటిలైన ప్రియాంక చోప్రా, ఇప్పుడో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. న్యూయార్క్ లో సోనా పేరిట ఇండియన్ రెస్టారెంట్ ను ఓపెన్ చేయబోతోంది. ప్రస్తుతం ఈ రెస్టారెంట్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. నెలాఖరుకు అందుబాటులోకి వస్తుంది.

రెస్టారెంట్ కు సంబంధించి మ్యూజిక్, మెనూ, ఇంటీరియర్ అంతా ప్రియాంక చోప్రా టేస్ట్ కు తగ్గట్టు డిజైన్ చేశారు. చివరికి రెస్టారెంట్ పేరు కూడా ప్రియాంకానే సెలక్ట్ చేసింది. ప్రియాంకతో పాటు ఆమె బెస్ట్ ఫ్రెండ్స్ డేవిడ్ రాబిన్, మనీష్ గోయల్ కలిసి ఈ రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేశారు.

ఇదొక ఇండియన్ రెస్టారెంట్. సిసలైన భారతీయ రుచుల సమ్మేళనం ఇందులో కనిపిస్తుందని చెబుతోంది ప్రియాంక. కేవలం మెనూ మాత్రమే కాకుండా.. ఇందులో అడుగుపెడితే భారత్ లో ఉండే ఫీలింగ్ వచ్చేలా అన్నీ డిజైన్ చేశారు. మాస్టర్ చెఫ్ హరినాయక్ ఈ రెస్టారెంట్ లో మెనూ బాధ్యతలు చూసుకుంటాడు.

ప్రియాంక నటించిన వైట్ టైగర్ రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో వచ్చింది. తాజాగా 'టెక్ట్స్ ఫర్ యు' అనే సినిమాను పూర్తిచేసిన ప్రియాంక, ప్రస్తుతం తన అప్ కమింగ్ షో సిటాడెల్ కోసం కొన్నాళ్లుగా లండన్ లో ఉంటోంది. 

కాజల్‌. సునీల్‌ శెట్టిగారికి కథ చెప్పగానే ఒప్పుకున్నారు

లోకేశ్ ప్ర‌తిమాట ఆణిముత్య‌మే