సర్దార్ బాటలో కాటమరాయుడు

మళ్లీ మామూలే. ఊరుకున్నన్నాళ్లు ఊరుకున్నారు. తీరా ఇప్పుడు విడుదల తేదీ నెల రోజుల్లోకి వచ్చేసరికి పరుగులు పెడుతున్నారు. కాటమరాయుడు సినిమా సంగతే ఇది. కాటమరాయుడు సినిమా టాకీ ఆల్ మోస్ట్ పూర్తయింది. కానీ పాటలు…

మళ్లీ మామూలే. ఊరుకున్నన్నాళ్లు ఊరుకున్నారు. తీరా ఇప్పుడు విడుదల తేదీ నెల రోజుల్లోకి వచ్చేసరికి పరుగులు పెడుతున్నారు. కాటమరాయుడు సినిమా సంగతే ఇది. కాటమరాయుడు సినిమా టాకీ ఆల్ మోస్ట్ పూర్తయింది. కానీ పాటలు మాత్రం వుండిపోయాయి. 

గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ టైమ్ లో ఇలాగే జరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్, హీరోయిన్ కాజల్ ను, సినిమాటోగ్రాఫర్ ను విదేశాలకు తీసుకుపోయి, చకచకా పాటలు తానే చుట్టేయించి వచ్చేసారు. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. మూడు పాటలను పది రోజుల్లో చుట్టేయాలని షెడ్యూలు చేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే పాటకు మూడు రోజులు అన్నమాట. అది కూడా విదేశాల్లోనే. 

ఈ మూడు కాక మరో పాట కూడా వుండే అవకాశం వుంది. అది ఇక్కడ సెట్ వేసి తీస్తారని టాక్. మొత్తం మీద టైమ్ వుండగా సినిమాను నత్త నడక నడిపించి, తీరా విడుదల దగ్గరకు వచ్చేసరికి కిందా మీదా అయిపోవడం పవన్ సినిమాలకు అలవాటైపోయిందేమో?