కొన్ని నమ్మశక్యం కాని విషయాలు ఒక్కోసారి ఇండస్ట్రీలో వినిపిస్తుంటాయి. బాలయ్య-క్రిష్ డైరక్షన్ లో శాతకర్ణి సినిమా చకచకా ముస్తాబవుతోంది. ఆరు నూరు కాదు..ఆరు నూర్లయినా సరే, సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసి తీరాలన్నది యూనిట్ సంకల్పం. కానీ అలా అని క్లాలిటీ అన్నది వన్ పర్సంట్ కూడా మిస్ కాకూడదన్నది మరో సంకల్పం. శాతకర్ణి షూటింగ్ పార్ట్ వరకు ఓకె.
వెల్ ప్లాన్డ్ గా క్రిష్ దాన్ని ఫినిష్ చేసేసినట్లే. కానీ ఈ గ్రాఫిక్స్ దగ్గరే సమస్య. ఇదంతా టెక్నికల్ ప్లస్ క్రియేటివ్ వర్క్. అనుకున్న టైమ్ కు పూర్తి కావడం అంటే కాస్త కష్టమే. బాహుబలి విషయంలో ఈ గ్రాఫిక్స్ వర్క్ చాలా ఇబ్బంది పెట్టి, సినిమాను లేట్ చేసిన సంగతి తెలిసిందే. శాతకర్ణి విషయంలో కూడా ఇలాంటి ఇబ్బంది వస్తుంటే, ఓ మాంచి ప్లాన్ వేసి, దాన్ని అధిగమిస్తున్నారని గుసగుస వినిపిస్తోంది. బాలయ్య కోసం బాహుబలి దర్శకుడు రాజమౌళి ఓ సాయం చేస్తున్నారని తెలుస్తోంది.
అదేంటంటే యుద్ద సన్నివేశాలకు సంబంధించి కొన్ని లాంగ్ గ్రాఫిక్స్ ను బాహుబలి 2 నుంచి శాతకర్ణికి ఇస్తున్నారట. ఇప్పటికే ఫినిష్ అయిన ఈ సీన్లను శాతకర్ణికి వాడతారట. అదే రేంజ్ లో వుండే శాతకర్ణి సీన్లు తయారీలో వున్నాయట. వాటిని రాజమౌళి పర్యవేక్షణలో ఫినిష్ చేయించి, బాహుబలికి వాడతారట. బాలయ్య కోసం రాజమౌళి ఈ అడ్జెస్ట్ మెంట్ కు ఓకె అన్నారని ఇండస్ట్రీలో గుసగుస వినిపిస్తోంది. ముందే చెప్పినట్లు నమ్మశక్యం కాని గుసగుసలు ఒక్కోసారి ఇండస్ట్రీలో వినిపిస్తుంటాయి మరి.