రాజ్ తరుణ్ తప్పులో కాలేసాడా?

చిన్న డెసిషన్ తేడా వస్తే కెరీర్ సూప్ లో పడిపోతుంది. యంగ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ పరిస్థితి ఇలాంటిదే ఇప్పుడు. ఒకేసారి ఒకే బ్యానర్ లో మూడు సినిమాలు ఓకె చేసాడు. కానీ…

చిన్న డెసిషన్ తేడా వస్తే కెరీర్ సూప్ లో పడిపోతుంది. యంగ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ పరిస్థితి ఇలాంటిదే ఇప్పుడు. ఒకేసారి ఒకే బ్యానర్ లో మూడు సినిమాలు ఓకె చేసాడు. కానీ ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాడు. ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వంశీకృష్ణ (దొంగాట) దర్శకత్వంలో ఒక సినిమా, మారుతి కథ, పార్టనర్ గా మరో సినిమా ఓకె చేసాడు. అలాగే వెలిగొండ శ్రీనివాస్ డైరక్షన్ లో మరొకటి.

వీటిలో తొలి సినిమా దాదాపు ఫినిష్ అయింది కానీ, మిగిలిన రెండు అర్థాంతరంగా ఆగిపోయినట్లే. మారుతి తన కథ ఇచ్చేసి, వాళ్లనే డెవలప్ చేసుకోమని చెప్పి, పార్టనర్ గా కూడా వైదొలిగాడు. దాంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. సంజన రెడ్డి అనే కొత్త డైరక్టర్ తొలి ప్రయత్నం అలా ఆగిపోయింది.ఇక వెలిగొండ శ్రీనివాస్ ప్రాజెక్టు కూడా డైలామాలో పడిందని టాక్ వినిపిస్తోంది. ఆయన కూడా స్క్రిప్ట్ ఇచ్చేసి పక్కకు తప్పుకున్నాడని టాక్ వినిపిస్తోంది. మరోపక్క గోల్డ్ ఎహె పరాజయం కూడా ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ ను కాస్త చిక్కుల్లో పడేసింది.

దీంతో ఇప్పుడు వంశీకృష్ణ డైరక్షన్ లోని సినిమా తరువాత ఏం చేయాలి? అన్న దానిపై రాజ్ తరుణ్ ఆలోచనల్లో పడినట్లు తెలుస్తోంది. గతంలో అన్నపూర్ణ స్టూడియో కమిట్ మెంట్ ఒకటి వుంది. అది చేయాలని ప్రయత్నాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.