మహేష్ ను భయపెడుతున్న శివ

మహేష్-మురగదాస్ సినిమా టైటిల్ పై యూనిట్ లో ఆలోచన మొదలయింది. తెలుగు తమిళ వెర్షన్ లకు ఒకటే పేరు పెట్టాలన్నది, పురాణాల్లోంచి సంస్కృత సంబంధిత పేరు కావాలన్నది దర్శకుడు మురుగదాస్ అభిమతం. శివుడు..శివ..ఇలాంటి పేరు…

మహేష్-మురగదాస్ సినిమా టైటిల్ పై యూనిట్ లో ఆలోచన మొదలయింది. తెలుగు తమిళ వెర్షన్ లకు ఒకటే పేరు పెట్టాలన్నది, పురాణాల్లోంచి సంస్కృత సంబంధిత పేరు కావాలన్నది దర్శకుడు మురుగదాస్ అభిమతం. శివుడు..శివ..ఇలాంటి పేరు ఏదయినా వుంటే బాగుంటుందని మురుగదాస్ ఆలోచన చేసారు. 

కానీ, తెలుగులో రామ్ గోపాల్ వర్మ శివ తప్ప, శివుడు పేరును వాడిని సినిమా టైటిళ్లు, కథలు అన్నీ కాస్త బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ ను ఇచ్చినవే. అందువల్ల ఇటు మహేష్, అటు నిర్మాతలు ఆ పేరు గురించి ముందు వెనుక ఆడుతున్నారు. కానీ ఈ సెంటిమెంట్ లు ఏవీ వర్కవుట్ అవ్వవని మురగదాస్ అంటున్నారు. 

అలా కాదు, ఆల్టర్ నేటివ్ పేరు ఏదయినా వుంటే బాగుంటుందని వెదుకులాడుతున్నారు. సరైనది దొరికితే సరే, లేకుంటే శివుడో, శివో, ఏజెంట్ శివ అనో పోస్టర్ మీదకు వచ్చేస్తుంది. అందుకే తెగ డిస్కషన్ చేసి, టైటిళ్లు వెదుకుతున్నారు.