కాలం కలిసి వస్తే నడచి వచ్చే బిడ్డ పుడతాడని సామెత. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా అంటేనే ఎప్పుడు స్టార్ట్ అయి, ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి. అలాంటిది త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనతోనే తరువాత సినిమా చేస్తా అని కూర్చున్నారేమిటా అని అందరూ తలా ఊహాగానం చేసారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ లో వుందట.
ప్రస్తుతం డాలీ డైరక్షన్ లో చేస్తున్న సినిమా ఇలా వుండగానే నవంబర్ లో 15 రోజులు త్రివిక్రమ్ సినిమాకు కేటాయించేసాడట పవన్. తన కాంబినేషన్ సీన్లన్నీ ఆ టైమ్ లో చేసేసుకోమన్నాడట. ఆ తరువాత మళ్లీ తన డేట్ లు సెట్ అయ్యే లోగా మిగిలిన సీన్లు చేసుకోమన్నాట. సో అందువల్ల నవంబర్ నుంచి త్రివిక్రమ్-పవన్ సినిమా స్టార్ట్ అయిపోతోందన్న మాట.
ఇదిలా వుంటే అ..ఆ సినిమాకు త్రివిక్రమ్ ను ముప్పుతిప్పలు పెట్టి, ఆఖరికి లాస్ట్ మినిట్ లో పక్కకు వెళ్లిపోయిన సంగీత దర్శకుడు అనిరుధ్ తనకు తానుగా వచ్చి, తను ఈ సినిమా చేసి, లాస్ట్ టైమ్ చేసిన మిస్టేక్ సరిచేసుకుంటానని అన్నాడట. అనడమే కాదు, కొద్ది రోజుల్లో ఇక్కడికే వచ్చి త్రివిక్రమ్ తో సాంగ్స్ సిట్యువేషన్లపై డిస్కషన్ కు కూర్చోబోతున్నాడట. తరువాత చెన్నయ్ వెళ్లి చకచకా ట్యూన్స్ ఇచ్చే బాధ్యత తనది అని మాట కూడా ఇచ్చాడట.
చూస్తుంటే త్రివిక్రమ్-పవన్ సినిమాకు మంచి రోజులు వచ్చినట్లే వుంది.