హైపర్ కు ఊపిరి అందింది

రామ్-సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో 14 రీల్స్ నిర్మించిన సినిమా హైపర్. తొలి రోజు ఏవరేజ్ టు అబౌవ్ ఏవరేజ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ ఫరవాలేదనిపించాయి. అయితే ఈ ఫలితం తో సంతృప్తి పడిపోక,…

రామ్-సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో 14 రీల్స్ నిర్మించిన సినిమా హైపర్. తొలి రోజు ఏవరేజ్ టు అబౌవ్ ఏవరేజ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ ఫరవాలేదనిపించాయి. అయితే ఈ ఫలితం తో సంతృప్తి పడిపోక, వదిలేయుకుండా పబ్లిసిటీ  మీద దృష్టి పెట్టారు. డిఫరెంట్ ఏడ్ లు కట్ చేయడం, థియేటర్ల విజిట్, ఇలా చాలా ..చాలా. 

దాంతో శనివారం కన్నా ఆదివారం మంచి ఫలితం కనిపించింది. ఓపెనింగ్ డే కన్నా ఆదివారం మంచి కలెక్షన్లు నమోదు చేసింది.  తొలి మూడు రోజులకు కలిపి ఎనిమిది కోట్ల వరకు కలెక్షన్ల సాధించింది.  దీంతో ఇప్పుడు హైపర్ కు ఊపిరి అందింది. ఇక ఇవ్వాల్టి నుంచి దసరా సెలవులు. నాలుగు రోజుల పాటు అవకాశం వుంది. ఆ తరువాతే కొత్త సినిమాలు వచ్చేంది. ఈ నాలుగు రోజుల్లో మరి కాస్త కలెక్షన్లు సాధిస్తే, బయ్యర్లు సేఫ్ అవుతారు. 

నిజానికి ధోనీ సినిమా వున్నా, దాన్ని పట్టించుకోకుండా సోలో అనుకుంటూ బరిలోకి దిగింది హైపర్. అక్కడే ధోనీ పర్సనల్ ఇమేజ్ ను తక్కువ అంచనా వేసారు. పల్లెల్లో కూడా ధోనీ పేరు తెలియని వారు లేరు. దాంతో ఆ మూవీ కాస్తా హైపర్ కు కాస్త గట్టి కాంపిటీషన్ నే ఇచ్చింది. లేకుండా వుండి వుంటే హైపర్ పేరుకు తగినట్ల కలెక్షన్లు రాబట్టగలిగి వుండేది.