జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత వెంటనే సినిమా రెడీగా లేకపోయింది ఎన్టీఆర్ కు. కేవలం సరైన డైరక్టర్ ఎవరూ అందుబాటులో లేకపోవడం తప్ప మరేం కారణం కాదు. అందుబాటులో వున్నది ఒక్క పూరి జగన్నాధ్ మాత్రమే. అయితే డిసెంబర్ కు ఫ్రీ అయిపోతున్న వివి వినాయక్ ఆప్షన్ గా ఎన్టీఆర్ ముందుకు ప్రతిపాదన వచ్చింది. కానీ అది ఆదిలోనే ఆగింది. దీనికి కారణం కాస్త రీజనబుల్ గానే వుంది.
వినాయక్ తో ఒకటే సమస్య. ఆయన స్వంతగా కథలు చేయలేరు. ఆయనకు ఎక్కువగా కథ మాటలు ఆకుల శివ లాంటి వాళ్లు అందించాల్సిందే. అందువల్ల డిసెంబర్ లో వినాయక్ ఖాళీ అయినా ఆయన ఎవర్నో ఒకర్ని కూర్చోబెట్టుకుని, కథ తయారుచేయాలి అంటే ఆర్నెల్లు పడుతుందట. అది మినిమమ్ టైమ్ అన్నమాట.
అంటే వినాయక్ తో ఎన్టీఆర్ సినిమా చేయాలి అంటే అది వచ్చే జూన్ కి కానీ సెట్ మీదకు వెళ్లదు. అందుకే ప్రస్తుతానికి ఆ ఆప్షన్ ను పక్కన పెట్టి, వేరేవి ఆలోచిస్తున్నాడు ఎన్టీఆర్. పోనీ ఇప్పుడు వేరే వాళ్లతో సినిమా చేసినా, ఆర్నెల్ల తరువాతయినా వినయ్ తో ఎన్టీఆర్ సినిమా చేస్తే, ఆ రేంజ్ వేరుగా వుంటుంది.