ఎవరైనా బ్యాంకాక్ వెళ్తే ఏ ఎలక్ట్రికల్ సామాన్లో, లిక్కరో ఇంకేవైనా తెచ్చుకొస్తారు. కానీ దర్శకుడు పూరి జగన్నాధ్ కథ పట్టుకువస్తాడు. ఆయనకు అక్కడి ఏంబియన్స్ వుంటే తప్ప కలం కదలదు..మెదడు చురుగ్గా పనిచేయదు. కథ చకచకా ముందుకు కదలదు. అదే అక్కడికి వెళ్తే, ఇలా దుకాణానికి వెళ్లి అలా కొనుక్కు వచ్చినట్లు, కథ తయారైపోతుంది. ఇలా వెళ్లి అలా వచ్చేస్తారు కథను చంకలో పెట్టుకుని.
ఇప్పుడు అదే జరిగింది. కొద్ది రోజుల క్రితం ఆయన ఎన్టీఆర్ సినిమా కు కథ కోసం విదేశాలకు వెళ్లారు. లైన్ ఇక్కడే తయారయింది. సూపర్ గా వుందని విన్నవాళ్లు అన్నారు. మరి దాన్ని టోటల్ సినిమాగా తయారుచేయాలి కదా? అందుకే విదేశాలకు వెళ్లారు. నిన్ననే తిరిగి వచ్చారు. కథ రెడీ చేసుకుని.
ఇక ఇవ్వాళో రేపో ఎన్టీఆర్ ను కలిసి కథ వినిపించడమే తరువాయి. ఓకె అయిపోయిందా.. ఎన్టీఆర్ట్స్ బ్యానర్ లో సినిమా స్టార్ట్ అయిపోతుంది. ఒకసారి స్టార్ట్ అయిందో, పూరి ఎక్స్ ప్రెస్ సూపర్ ఫాస్ట్ కదా..నాలుగైదు నెలల్లో సినిమా రెడీ అయిపోతుంది. అంటే కథ ఓకె కావాలి అది ఒక్కటే సమస్య అన్నమాట. రెండు రోజులు ఆగితే తెలిసిపోతుంది. పూరి ఎలాంటి కథ పట్టుకు వచ్చారో విదేశాల నుంచి.