సెన్సార్ ముందు చేయిస్తే సమస్యే?

సెన్సార్ ముందుగా చేయిస్తే, ఏ టెన్షన్ వుండదు. మిగిలిన పనులు అన్నీ స్మూత్ గా చక్కబెట్టుకోవచ్చు అనుకుంటారు నిర్మాతలు. కానీ ఇటీవల టాలీవుడ్ లో అదే సమస్యగా మారుతోంది. సినిమా ఫస్ట్ కాపీ రెడీ…

సెన్సార్ ముందుగా చేయిస్తే, ఏ టెన్షన్ వుండదు. మిగిలిన పనులు అన్నీ స్మూత్ గా చక్కబెట్టుకోవచ్చు అనుకుంటారు నిర్మాతలు. కానీ ఇటీవల టాలీవుడ్ లో అదే సమస్యగా మారుతోంది. సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిపోయి, విడుదలకు పది రోజులు ముందుగా సెన్సార్ చేయించుకుంటే,  ఇండస్ట్రీలో నానా రకాల టాక్ లు స్ప్రెడ్ అయిపోతున్నాయి. 

సెన్సార్ కావడం భయం, సెన్సార్ టాక్ కోసం ఆరాలు ప్రారంభం కావడం సహజం. ఈ ఆసక్తిని ఆసరాగా తీసుకుని, సినిమా అంటేనో, హీరో, నిర్మాణ యూనిట్ అంటేనో గిట్టని వాళ్లు తమ చిత్తానికి టాక్ ను స్ప్రెడ్ చేస్తున్నారు. దీనికి తోడు సెన్సారు సభ్యుల్లో ఎవరైనా, లేదా ఆఖరికి సినిమా స్క్రీన్ చేసినపుడు వున్న టెక్నికల్ స్టాఫ్ అయినా చిన్న లీడ్ ఇస్తే చాలు, ఇక కథలకు కథలు అల్లేస్తున్నారు. 

దీనికి తోడు సినిమాను అగ్రిమెంట్ చేసుకున్న బయ్యర్లు కూడా సెన్సార్ టాక్ మీద ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలా బ్యాడ్ టాక్ కాస్త స్ప్రెడ్ అయ్యేసరికి, దొరికింది వంక, అని మొదటి అగ్రిమెంట్లు పక్కన పెట్టి కొత్త బేరాలు సాగిస్తున్నారు. విడుదల ముందు రోజు డబ్బు కట్టేదగ్గరకు వచ్చేసరికి మొహం చాటేయడమో, అంత కట్టలేం, ఇంతే అనో, లేదు, రన్నింగ్ లో కడతాం అనో చెబుతున్నారు. 

దీంతో నిర్మాత కిందా మీదా అవుతున్నారు. దసరాకు దాదాపు ఆరు సినిమాలు విడుదలవుతున్నాయి. ఇవన్నీ ఇప్పటికే సెన్సారు పూర్తి చేసుకున్నాయి. వీటి సెన్సార్ టాక్ అంటూ ఇండస్ట్రీలో విచ్చల విడి కథనాలు వినిపిస్తున్నాయి. మరి ఏవి నిజాలో, ఏవి ప్రచారాలో సినిమాలు విడులయ్యాకే తెలుస్తుంది.