మెగారేట్లు ఓ రేంజ్ లో వున్నాయి

రాను రాను మార్కెట్ పెరుగుతోంది. పెరుగుతున్న మల్టీ ఫ్లెక్స్ లు, ఫస్ట్ వీక్ లో కామన్ టికెట్ రేటును ప్రభుత్వం చూసీ చూడనట్లు వదిలేయడం వంటి వాటితో, సినిమాల కలెక్షన్లు జిగ్గు మంటున్నాయి. అందుకే…

రాను రాను మార్కెట్ పెరుగుతోంది. పెరుగుతున్న మల్టీ ఫ్లెక్స్ లు, ఫస్ట్ వీక్ లో కామన్ టికెట్ రేటును ప్రభుత్వం చూసీ చూడనట్లు వదిలేయడం వంటి వాటితో, సినిమాల కలెక్షన్లు జిగ్గు మంటున్నాయి. అందుకే రాను రాను సినిమాల రేట్లు కూడా ఆకాశాన్నంటేసేలా వున్నాయి.

చిరంజీవి 150 వ సినిమా ఖైదీ నెంబర్ 150 కు నిర్మాతలు ఫిక్స్ చేసారని వినిపిస్తున్న రేట్లు వింటుంటే, అమ్మో అనిపిస్తోంది. అయితే, బాహుబలికి వచ్చేసాయి, జనతా గ్యారేజ్ కు వచ్చేసాయి. దీనికి వచ్చేస్తాయేమో అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. సీడెడ్ కు పది కోట్లకు పైగా, నైజాంకు 20 కోట్ల వరకు, ఆంధ్రకు ముఫై కోట్ల వరకు, ఓవర్ సీస్ 14 కోట్లు ఖైదీ నెంబర్ 150కి రేట్లు ఫిక్స్ చేసారని టాక్ వినిపిస్తోంది. అంటే ఇక్కడికే 74 కోట్లు అన్నమాట. 

ఇంకా కర్ణాటక, తమిళనాడు, రెస్టాఫ్ ఇండియా, శాటిలైట్, డిజిటల్ రైట్స్, అడియో రైట్స్ వుండనే వున్నాయి. అన్నీ కలిపి వంద కోట్లు దాటేయాలని ప్లాన్ అన్నమాట. ఆంధ్రలో విడివిడిగా ఫిక్స్ ఛేసిన రేట్లు కూడా ఆ రేంజ్ లోనే వున్నాయి. ఈస్ట్ 6 కోట్లు చెబుతున్నారట. వెస్ట్ నాలుగు, కృష్ణ నాలుగు పైన చెబుతున్నారని వినికిడి. అంటే బాహుబలి అమ్మకం రేట్లను దాటేయాలనే అన్నమాట. 

మరి ఇంతకీ వసూళ్లు ఎలా వుంటాయో? రేట్లు చూసి అమ్మో అని కొందరు అంటుంటే, ఫరావాలేదు అని ధైర్యం చేసి కొనడానికి వస్తున్నారట కొందరు. టాలీవుడ్ మార్కెట్ అలా వుంది మరి.