సినిమా హిట్ అయిందని నిర్మాత కారు ఇచ్చాడు..హీరో ఇంకోటి ఇచ్చాడు..ఇలాంటి వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. నిజానికి ఇవన్నీ బోగస్ నే. దీని వెనుక తతంగం వేరే వుంటుంది. వీళ్ల డబ్బులతోనే కొని వీళ్లకే గిఫ్ట్ లు ఇవ్వడం అన్నది టాలీవుడ్ లో జరిగే తంతు.
బిఎమ్ డబ్ల్యు, ఆడి, ఇలాంటి భారీ కార్లు కొన్నారు అంటే, ఆదాయ పన్ను శాఖ అధికారుల దృష్టిలో పడినట్లే. వారికి సమాచారం వెళ్లిపోతుంది. అలాగే భారీగా ఆస్తులు కొన్నా. అందుకే తమ బ్లాక్ మని అవతలి వారికి ఇచ్చి, వారి వైట్ మనీని తమ వాహనంగా మారుస్తారు.
ఆ మేరకు గిఫ్ట్ టాక్స్ లు వగైరా వుంటే వీళ్లు కట్టేసుకుంటారు. వాళ్లకి ఆదాయంలో గిఫ్ట్ కింద కట్ అయిపోతుంది. వీళ్లకు గిఫ్ట్ కింద వస్తుంది. కృతజ్ఞత లేదా మొహమాటం, లేదా మరో సినిమాకు అడ్వాన్స్ కింద ఇలాంటి వ్యవహారాలు నడుస్తుంటాయి. అంతే తప్ప, ఓ ప్రేమ కారిపోయి కాదు, మరేమీ కాదు.