చేసిన జోనర్ లో వరుసగా సినిమా చేయకుండా,వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ, ఫిఫ్టీ దాటేసినా, కేరీర్ డెడ్ ఎండ్ కు రాకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు నాగార్జున. ఊపిరి సినిమా విషయంలో ధైర్యం చేసి మంచి మార్కులు కొట్టేసాడు. అలాగే మరో సినిమా మీద కూడా కన్నేసాడు కానీ, మళ్లీ ఎందుకో వెనక్కు తగ్గినట్లు వినికిడి.
మలయాళంలో ఇటీవల విడుదలైన ఒప్పం సినిమా మీద ముందు నుంచీ నాగ్ కాస్త ఆసక్తి కనబర్చారట. మోహన్ లాల్ నటించిన ఈ సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. తెలుగువారికి కూడా పరిచయం అయిన ప్రియదర్శన్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి, విడుదయ్యే వరకు కూడా నాగ్ ఆసక్తిగా గమనించాడని తెలుస్తోంది.
కానీ సినిమా బాగుంది, క్రిటిక్స్ అప్లాజ్ దక్కింది కానీ, తెలుగు ప్రేక్షకులు ఏక్సెప్ట్ చేస్తారా అన్న అనుమానంతో వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఈ సినిమాలో మోహన్ లాల్ పుట్టి గుడ్డి. లిఫ్ట్ ఆపరేటర్. ఓ క్రయిమ్ ను శోధిస్తాడు. ఈ సబ్జెక్ట్, ఈ క్యారెక్టర్ తనకు సూట్ కావేమో అని అనుమానంతో నాగ్ వెనక్కు తగ్గినట్లు బోగట్టా.