దర్శకుడు వివి వినాయక్ నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఖైదీ నెం 150 సినిమా విషయంపై ఆయన మీద తీవ్ర వత్తిడి పెరిగిపోయినట్లు తెలుస్తోంది. చిరు ఈ సినిమాను చాలా అంటే చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. ప్రతి చిన్న దానికి చాలా హడావుడి చేస్తున్నారు. టీజర్ విడుదలకే ఊరంత హడావుడి చేసారు. ఈ సినిమా హిట్ అయి తీరాలని మెగాస్టార్ భావిస్తున్నారు. ఫ్యాన్స్ కూడా అదే తీరుగా వున్నారు. దీంతో వినాయక్ కు టెన్షన్ పెరిగిపోతోందని టాక్ వినిపిస్తోంది.
ఎంత పెద్ద స్టార్ అయినా, పెద్ద దర్శకుడు అయినా హిట్ అన్నది సినిమా తెరమీద పడిన తరువాత ప్రేక్షకుడు డిసైడ్ చేయాల్సిన విషయమే. కానీ ప్రేక్షకులు అలా డిసైడ్ కావాలంటే ఇలాగే చేయాలని సినిమా రాజ్యాంగం అంటూ ఏమీ లేదు. అందుకే ప్రతి సినిమా ఓ పరీక్షే అవుతుంది దర్శకులకు. కానీ మెగాస్టార్ 150 వ సినిమా అన్నది మరీ పెద్ద పరీక్షగా మారిపోయింది వినాయక్ కు. తీసుకున్న సబ్జెక్ట్ వాస్తవానికి రైతులకు సంబంధించిన సీరియస్ ఇస్యూ మీద. దాన్ని మాస్ జనాలకు నప్పేలా పరుచూరి గోపాల కృష్ణ అనేక మార్పులు చేర్పులు చేసారు.
దానికి తోడు చిరు సినిమా అంటే ఎన్ని వుండాలో, కామెడీ, డ్యాన్స్ లు, ఫైట్లు, ఎమోషన్లు, ఇలా అన్నీ జోడించుకుంటూ వెళ్తున్నారు. సో, ఇవన్నీ కలిసి ఎలా వచ్చాయన్నది సినిమా వస్తే కానీ తెలియదు. అదే వినాయక్ టెన్షన్ గా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.