హీరోల డేట్ లు, ఇతరత్రా వ్యవహారాలు చూస్తుంటారు మేనేజర్లు. అలా చూసి చూసి, సరదాగా మనమూ ఓ సినిమా చేస్తే పోలా అనుకుంటూ వుంటారు. అలా మేనేజర్లు కూడా నిర్మాతలైపోతుంటారు. అలా ప్రొడ్యూసర్లయిన ఇద్దరు మేనేజర్ల సినిమాలు ఈ నెల విడుదలవుతున్నాయి. ఒకటి నాయకి, రెండవది 100 డేస్ ఆఫ్ లవ్.
ఈ రెండు సినిమాల ప్రొడ్యూసర్లు స్టార్లకు మేనేజర్లే. నాయకి ప్రొడ్యూసర్ గిరిధర్ పలువురు సక్సెస్ ఫుల్ హీరోయిన్లకు మేనేజర్ గా పనిచేసారు. ఆయన గతంలో కూడా ఓ సినిమా నిర్మించారు. అలాగే 100 డేస్ ఆఫ్ లవ్ నిర్మాత వెంకట్ కూడా పలువరు హీరోలకు మేనేజర్ గా వున్నారు. ఇదిలా వుంటే గతంలో ఎన్టీఆర్ దగ్గర పనిచేసిన కృష్ణ కూడా ఇప్పుడు ఓ సినిమా నిర్మిస్తున్నారు.
ఒకప్పుడు సినిమాల ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ లు ఎక్కువగా నిర్మాతలుగా మారేవారు. ఇప్పుడు ఆ ఆచారాన్ని మేనేజర్లు అందిపుచ్చుకుంటున్నట్లుంది.