అఖిల్ ఛాయిస్..పక్కా లవ్ స్టోరీ

అక్కినేని అఖిల్ రెండో సినిమా ఎప్పుడు? ఎవరితో? ఇదీ ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్. పూరి తో సినిమా అన్నది ఆరంభం నుంచీ పెద్దగా ఇంట్రస్ట్ లేదు. ఛాయిస్ లేదు కదా..లోఫర్ హిట్ అయితే…

అక్కినేని అఖిల్ రెండో సినిమా ఎప్పుడు? ఎవరితో? ఇదీ ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్. పూరి తో సినిమా అన్నది ఆరంభం నుంచీ పెద్దగా ఇంట్రస్ట్ లేదు. ఛాయిస్ లేదు కదా..లోఫర్ హిట్ అయితే చూద్దాం అనుకున్నాడు..అది కాస్తా అలా అయిపోయింది. సో..ఇప్పుడు ఎవరు డైరక్టర్?

ఎవరు డైరక్టర్ అయినా, రెండో సినిమాగా మాస్ మసాలా సినిమా అయితే వద్దు కాక,వద్దు అంటున్నాడట అఖిల్. పక్కా లవ్ స్టోరీనే కావాలి అని స్పష్టంగా చెబుతున్నాడట. కావాలంటే అందులో ఎక్కడయినా ఒకటి రెండు ఫైట్లు వుండొచ్చుకానీ, మాస్ వ్యవహారాలు మాత్రం వద్దంటున్నాడట. దీంతో అఖిల్ కు నప్పే కథలు వండేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. కానీ డైరక్టర్ ఎవరు అన్నదగ్గర మళ్లీ సమస్య వస్తోంది. 

ఇటీవల మాంచి మాస్ హిట్ కొట్టిన డైరక్టర్ తో అఖిల్ సినిమా చేస్తాడని ఓ టాక్ వినిపిస్తోంది. కాదు, మణిరత్నంతో వీలవుతుందా అని ట్రయ్ చేస్తున్నాడని మరో టాక్. దేవాకట్టా ఓ మాంచి సబ్జెక్ట్ రెడీ చేసి, అఖిల్ ను ఇంప్రెస్ చేసే ఫ్రయత్నంలో వున్నాడని ఇంకో టాక్. 

మరి చివరకు అఖిల్ సినిమా ఎవరి పరమవుతుందో చూడాలి.