తను మొన్నేవెళ్లిపోయింది అంటూ ఎప్పటిలా వెరైటీ పేరు పెట్టి, నిఖితా నారాయణ్, అజ్మల్ తో వంశీ సినిమా తీసారు. ఆడియో ఫంక్షన్ గ్రాండ్ గా చేసారు. మరి అంతే ఆ సినిమ అతీగతీ లేదు. తరువాత పేరు మార్చారు.
నిఖితా నారాయణ్ ని భాగస్వామిగా కూడా చేసుకున్నారు. మళ్లీ కాస్త హడావుడి చేసారు. కానీ ఇప్పుడు దాని పరిస్థితీ సేమ్ టు సేమ్. ఇప్పటికీ రచయితగా, డైరక్టర్ గా తనకంటూ కొంత మంది అభిమానులను కలిగి వున్న వంశీ కెరీర్ కు ఇక్కడితో ఇలా ఫుల్ స్టాప్ పడిపోయినట్లుంది.
ఈ సినిమాను వదిలేసి మరో సినిమా చేద్దామనుకున్నా, చేయించుకునే వారు కనిపించడంలేదు. దాంతో అడపా దడపా కథలు రాసుకుంటూ కాలక్షేపం చేసేస్తున్నారు. కొత్త నీరు వస్తుంటే పాత నీరు ఇలా కొట్టుకుపోతుంది..అది సహజం అంతే.