రంగతరంగపై చాలా కళ్లు?

కన్నడ, మలయాళ, తమిళ రంగాల్లో తక్కువ బడ్జెట్ తో మంచి సినిమాలు తీసి, కోట్లు కొల్ల గొడుతున్నారు. మనవాళ్లు ఎలాగూ మనం ఎలాగూ తీయలేం అని, వాటి హక్కులు కోటికో, రెండు కోట్లకో కొని…

కన్నడ, మలయాళ, తమిళ రంగాల్లో తక్కువ బడ్జెట్ తో మంచి సినిమాలు తీసి, కోట్లు కొల్ల గొడుతున్నారు. మనవాళ్లు ఎలాగూ మనం ఎలాగూ తీయలేం అని, వాటి హక్కులు కోటికో, రెండు కోట్లకో కొని ఇక్కడ రీమేక్ చేస్తున్నారు.

ఇప్పుడు ఇలాంటి జాబితాలో మరో సినిమా చేరింది. అదే కన్నడ సినిమా రంగతరంగ. కర్ణాటకలోని అందమైన సహజ లొకేషన్లను మరింత అందంగా చూపిస్తూ, చిత్రీకరించిన థ్రిల్లర్. ఈ సినిమాలో మన సాయికుమార్ కూడా కీలకపాత్ర ధరించాడు. ఓ గ్రామంలో జరిగే కథ..ఇందులో ఓ రచయిత, జర్నలిస్టుల పాత్రలు వగైరా ఈ సినిమా కథాంశం.

ఇప్పుడీ కథ హక్కులు తీసుకోవాలని గీతా ఆర్ట్స్ ప్రయత్నాలు ప్రారంభించింది. మరి ఎవరితో రీమేక్ చేయాలనో అన్నది ఇంకా తెలియదు. మరోపక్క ఈ సినిమాలో కీలకపాత్ర ధరించిన సాయికుమార్ కూడా తన కొడుకు ఆది కోసం ఈ సినిమా ను ఎవరిచైతనైనా కొనిపించాలని చూస్తున్నాడట. మొత్తం మీద ప్రేమమ్ వ్యవహారం పూర్తయిపోయింది. ఇప్పుడు రంగ తరంగ మీద పడ్డారు.