సినిమాల నిర్మాణం తగ్గించి డిస్ట్రిబ్యూటర్‌గా బిజీ అయిన దిల్ రాజుకి ఇలాక్కూడా నష్టాలు తప్పడం లేదు. అతను కొన్న రభస, ఆగడు చిత్రాలు దిల్ రాజుకి భారీ నష్టాన్ని తెచ్చిపెట్టాయి. రభస చిత్రాన్ని నైజామ్‌కి పంపిణీ చేసిన దిల్ రాజు దానిపై అయిదు కోట్ల వరకు నష్టపోయాడని ట్రేడ్ రిపోర్ట్.
ఆగడు చిత్రాన్ని వైజాగ్ ఏరియాలో పంపిణీ చేసిన దిల్ రాజుకి అక్కడా చేతులు కాలాయి. వైజాగ్‌లో ఆగడు పర్ఫార్మెన్స్ మరీ దారుణంగా ఉండడంతో తక్కువలో తక్కువ మూడు కోట్లు లాస్ తప్పదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. వరుసగా పలు భారీ చిత్రాలని నిర్మించిన దిల్ రాజు నిర్మాణానికి తాత్కాలిక విరామం ప్రకటించి డిస్ట్రిబ్యూషన్‌తో బిజీ అయ్యాడు.
ఈ సీజన్లో వస్తోన్న భారీ చిత్రాలన్నిటినీ ఏదో ఒక ఏరియాకి కొన్న దిల్ రాజుకి వరుస దెబ్బలు తగిలాయి. త్వరలో రాబోతున్న గోవిందుడు అందరివాడేలే చిత్రాన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తోన్న దిల్ రాజుకి దాంతో ఏమైనా ఊరట దక్కుతుందేమో చూడాలి.
దిల్ రాజుకి ఎన్టీఆర్, మహేష్ దెబ్బ!
సినిమాల నిర్మాణం తగ్గించి డిస్ట్రిబ్యూటర్‌గా బిజీ అయిన దిల్ రాజుకి ఇలాక్కూడా నష్టాలు తప్పడం లేదు. అతను కొన్న రభస, ఆగడు చిత్రాలు దిల్ రాజుకి భారీ నష్టాన్ని తెచ్చిపెట్టాయి. రభస చిత్రాన్ని నైజామ్‌కి…
Advertisement