cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Chanakya

సీమాంధ్రకు వీడని నీడ తెలంగాణ

ఇక ఇంతవరకు కేంద్రం ఆంధ్రకు సంబంధించి సహాయాలు కానీ, వెసులు బాటు లు కానీ ప్రకటించలేదు. ఈ బడ్జెట్ లో ఏవైనా ప్రకటిస్తుందా అని ఆశ. అలా ప్రకటించిన సమయంలో తెలంగాణను దృష్టిలో పెట్టుకోక తప్పదు. పెట్టుకుంటుంది. విద్యుత్ పంపంకం సక్రమంగా లేదన్న కేంద్రం ఏమీ పట్టించుకోలేదు. మోడీ ప్రభుత్వం కూడా యుపిఎ మాదిరిగానే సీమాంధ్ర ఫిర్యాదును వినీ విననట్లు ఊరుకుంది. ఇప్పుడు కరెంట్ కోసం బాబు పాట్లు బాబు పడుతున్నారు. బడ్జెట లో అంతకన్నా గొప్పగా ఊడబొడుస్తుందన్న దాఖలాలు కనిపించడం లేదు. వెసులుబాటులే తప్ప, ఆర్థిక సాయాలు అంతగా రాకపోవచ్చు. రాజధాని ప్రకటన దిశగా ఇంతవరకు కేంద్రం ఏమీ కృషి చేస్తున్నట్లు కనిపించడం లేదు.

కృష్టా, గుంటూరు కోసం మే చంద్రబాబు, వెంకయ్య నాయుడు కలిసి చేస్తున్న వ్యవహారాలను రాష్ట్ర భాజపాలోని కమ్మ వ్యతిరేక వర్గాలు, ఆరెస్సెస్ వర్గాలు మోడీకి చేరవేసినట్లు తెలుస్తోంది. వీలయినన్ని సంస్థలు, రాజధాని, కీలక పోస్టులు ఆ వర్గానికి, ఆ వర్గ ప్రాంతానికి ఇస్తున్నట్లు ఆరెస్సెస్ వాదులు కొందరు కేంద్రానికి చేరిసినట్లు తెలుస్తోంది. వెంకయ్యనాయుడు ఉన్నట్లుండి రాజధానిపై సైలెంట్ కావడం దీని పర్యవసానమే అని వినికిడి .ప్రభుత్వం ఏర్పడి నెల దాటినా రాజధాని సద్దు లేదు. అయిదేళ్ల ఉమ్మడి వుంది కాబట్టి అర్జెంట్ విషయంగా కేంద్రం భావించడం లేదు. కానీ చంద్రబాబుకు మాత్రం ఇది త్వరగా తేలితే, విరాళాలు దండేసి, నిర్మాణాలు చేసేద్దామని వుంది. బాబుతో మొహమాటం కోసం విరాళాలు ఇచ్చేవారు అంతా ఇప్పటికే లోకేష్ ప్రారంభించిన కార్యకర్తల నిధికి ఇచ్చేస్తున్నారు. ఆ విధంగా యువరాజా వారు హ్యాపీ, తద్వారా రాజవారు హ్యాపీ అవుతారని వారి భావన. కానీ మరి రాజధాని దగ్గరకు వచ్చేసరిక మళ్లీ మొదట్నించీ వసూళ్లు తప్పకపోవచ్చు.

సరే ఈ సంగతి అలా వుంచితే, సీమాంధ్రకు పన్ను వెసులుబాటు ఇస్తే, తమకీ ఇవ్వాలని తెలంగాణ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం దానికి తలవొగ్గేలాగే వుంది. లేకుంటే భాజపా తెలంగాణలో ఈ పాటి స్థాయిలో కూడా వుండకుండా పోతుంది. కానీ అలా తెలంగాణకు వెసులుబాటు ఇస్తే, సీమాంధ్రకు తరలిపోయే పరిశ్రమలు పెద్దగా వుండవు. బాబు సమ్ థింగ్ అదనంగా ఇవ్వాల్సి వుంటుంది. కానీ సీమాంధ్ర బడ్జెట్ దాన్ని భరించగలదా?

ఇప్పుడు అన్ని విధాలా చంద్రబాబు కేంద్రం పైనే ఆధారపడి వున్నారు. అది ఆదుకోవడం తప్ప మరో దారి లేదు. అందుకే బాబు సీజన్ టిక్కెట్ హోల్డరు మాదిరిగా, గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాదిరిగా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. ఇదంతా కేసిఆర్ సైలెంట్ గా గమనిస్తున్నారు. బాబు ఏది సాధిస్తే,అది కెసిఆర్ కు ఆటోమెటిక్ గా వచ్చేస్తుంది మరి. సిట్యువేషన్ అలాంటిది. ఎవరూ ఏమీ చేయలేరు.

చాణక్య

[email protected]

మహేష్ ఙోకులు మామూలుగా వుండవు

టార్గెట్ 175.. కొడతారా? లేదా?