Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

కార్టూన్ స్టోరీ: పడితే పోతాడు.. పడకుంటే తాడు!

కార్టూన్ స్టోరీ: పడితే పోతాడు.. పడకుంటే తాడు!

‘ఎంతైనా లాస్ట్ పంచ్ మనదైతే.. ఆ కిక్కే వేరప్పా’ అనేది పవన్ కల్యాణ్ చేసిన సినిమాలో డైలాగు మాత్రమే అనుకోకూడదు. ప్రస్తుతం ఆయన జెఎఫ్‌సి అనే రూపంలో చేస్తున్న కసరత్తు యొక్క ఫిలాసఫీ కూడా అదే అన్నట్లుగా కనిపిస్తోంది.

రాష్ట్రానికి కేంద్రం ద్వారా రావాల్సిన అన్ని హక్కులను సాధించడానికి ఇప్పటికే ఏపీ పరిధిలో చేయగలిగిన వారందరూ తమతమ స్థాయిలో పోరాటాలు చేసేశారు. తొలినుంచి పోరుబాటలోనే ఉన్న వైఎస్సార్ సీపీ ఏకంగా పదవీ రాజీనామాలకు సిద్ధపడగా.. అదే సమయంలో తెదేపా కూడా పార్లమెంటు వేదికగా నిరసనలు తెలియజేసింది.

ఇలా అందరూ అన్ని పోరాటాలు చేసేసిన తర్వాత చివర్లో ఎంటరైన పవన్ కల్యాణ్ లాస్ట్ పంచ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే అసాధ్యం అయినప్పటికీ చాలా పెద్ద మాట వాడుతున్నారు. మోడీ సర్కారుపై అవిశ్వాసం పెట్టాలని సూచన చేస్తున్నారు. అవిశ్వాసం ద్వారా సాధించేది శూన్యం అని స్పష్టంగా సమీకరణాలు కనిపిస్తున్నప్పటికీ.. అవిశ్వాసం పెట్టడానికీ తెదేపా, వైసీపీల చిత్తశుద్ధికీ ఆయన లింకు పెట్టారు.

అయితే అవిశ్వాసం పెట్టినంత మాత్రాన ఏం ఒరుగుతుంది. కేంద్రంలో చెప్పుకోడానికి పాలన సాగిస్తున్నది ఎన్డీయే సర్కారే అయినప్పటికీ.. భాజపాకు సింగిల్ పార్టీగానే.. సగానికి పైగా సీట్లు ఉన్నాయి. దాదాపు ఇరవయ్యేళ్ల తర్వాత.. సింగిల్ పార్టీ పూర్తి మెజారిటీ సాధించడం ఇదే ప్రథమం.

ఇలాంటి నేపథ్యంలో మోడీ సర్కారు చాలా బలంగా ఉన్న ప్రస్తుత నేపథ్యంలో వారి అధికారం కుర్చీ కాలు కదిలించడం కూడా అవిశ్వాసం వల్ల కాదు. మరి పవన్ కల్యాణ్ మాత్రం పోయేది తన పరువు కాదు గనుక.. తెదేపా వైసీపీ ల చిత్తశుద్ధికి ముడిపెట్టి అవిశ్వాసం అనే మాట వాడడం కామెడీలాగా ఉన్నదని పలువురు భావిస్తున్నారు.

పవన్ కల్యాణ్ ‘తనది కాకపోతే..  కాశీ దాకా వెళ్లమన్న’ సామెత చందంగా సలహాలు ఇవ్వకుండా.. ప్రాక్టికల్ గా సాధ్యాసాధ్యాలు తెలుసుకుని సలహాలు ఇస్తే బాగుంటుందని  పలువురు సూచిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?