Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

కార్టూన్ స్టోరీ: ఆత్మబలిదానమే బ్రహ్మాస్త్రం!

కార్టూన్ స్టోరీ: ఆత్మబలిదానమే బ్రహ్మాస్త్రం!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం కోసం తాను చేయదలచుకున్న పోరాటాన్ని పతాకస్థాయికి తీసుకువెళ్లారు. కేంద్రం మీద అలుపెరగని పోరాటం సాగించడంలో తమ ఎంపీలు పార్లమెంటు సమావేశాలు మొదలైన నాటినుంచి ఇప్పటిదాకా పడినకష్టానికి విలువ తగినంత దక్కకపోవడం మాత్రమేకాదు.. రాష్ట్రానికి తగినంత ప్రయోజనం చేకూరలేదని భావించిన జగన్మోహన్ రెడ్డి.. బలిదానాలకైనా సిద్ధం అనే సంకేతాలు ఇచ్చేశారు.

రాష్ట్రానికి సంజీవని వంటి ప్రత్యేకహోదాను సాధించడానికి కేంద్రంపై వరుస ఉద్యమాల ద్వారా ఒత్తిడి తీసుకురావాలని.. అప్పటికీ కదలిక లేకుంటే.. ఏప్రిల్ 6నాటికి ఎంపీలతో రాజీనామాలు చేయించాలని.. జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. రాజకీయంగా రాష్ట్రంకోసం పోరాటం తీవ్రత పెంచడం మాత్రమే కాకుండా.. రాజకీయంగా కూడా ప్రత్యర్థులపై బ్రహ్మాస్త్రం వేసేశారు.

ఇప్పుడు రాజకీయంగా మరోచర్చ కూడా జరుగుతోంది. వైఎస్ జగన్ కేవలం ఎంపీలతోనే కాకుండా.. ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయిస్తే.. ప్రభుత్వం మీద ఇంకాస్త ఒత్తిడి పెరుగుతుందని, ప్రత్యేకించి చంద్రబాబునాయుడు మీద ఒత్తిడి పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ పనిచేస్తే.. జగన్ స్వయంగా తన పదవిని కూడా వదులుకుంటూ.. ఆత్మబలిదానానికి సిద్ధపడినట్టే లెక్క.

అదే జరిగితే.. రెండు రకాలుగా ఆయనకు డబుల్ ఎడ్వాంటేజీ లభిస్తుంది.

1. కేంద్రం ఎంపీల రాజీనామాలు ఆమోదించడంతో నిమిత్తం లేకుండా... రాష్ట్రం ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించేస్తే గనుక.. ప్రజల గళాన్ని, ప్రత్యేకహోదా గురించిన వారిలోని వాంఛను ఎలుగెత్తి చాటడానికి తాము సదా సిద్ధంగా ఉన్నాం అని జగన్ చాటుకుని ఎన్నికల గోదాలోకి దిగవచ్చు. ఎటూ తాము బరిలోకి దిగుతున్నవన్నీ తమ సిట్టింగ్ స్థానాలే గనుక.. వైసీపీకే ఎడ్వాంటేజీ ఉంటుంది. నంద్యాల ఉపఎన్నికకు వందకోట్లు ఖర్చు పెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం.. ఇంత పెద్దసంఖ్యలో.. వైసీపీ సీట్లలో పోటీకి దిగడానికి ఎన్ని వందలకోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందో కదా? అందుకు వారు సిద్ధపడడం, తెగించడం అనేది అసాధ్యం.

2. ఒకవేళ తమ రాజీనామాలు ఆమోదించకపోతే.. తాము పోరాటం చేస్తాం అంటే.. తాము ప్రజాగళాన్ని వినిపించడానికి తిరిగి ఎన్నికల గోదాలోకి దిగడానికి సిద్ధపడుతోంటే.. చంద్రబాబు ప్రభుత్వం సైంధవుడిలాగా అడ్డుపడుతోందని ఆరోపణలు చేయవచ్చు.

పైగా ఇప్పుడున్న ఎమ్మెల్యే పదవుల వల్ల.. వైసీపీ వారికి ఒరుగుతున్నది ఏమీలేదు. చెప్పుకోడానికి వారు ఎమ్మెల్యేలే తప్ప.. కనీసం అసెంబ్లీకి కూడా వెళ్లడంలేదు. ఇలాంటి నామమాత్రపు పదవులు ఉంటే ఎంత? పోతే ఎంత? అనుకుని త్యాగంచేస్తే.. జగన్ పార్టీ పోరాటం.. మరో రేంజికి దూసుకువెళ్లిపోతుందనడంలో సందేహంలేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?