Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

హరిహరీ-4 : స్వామి రక్షణ భక్తుల బాధ్యత!

హరిహరీ-4 : స్వామి రక్షణ భక్తుల బాధ్యత!

ధర్మో రక్షతి రక్షిత:... అన్న వేదోక్తి కాస్తా.. ఇప్పుడు.. ‘‘దేవో రక్షతి రక్షిత:’’ అన్నట్లుగా తయారవుతున్నది. అవును దేవుడిని భక్తులు రక్షించుకుంటూనే.. వారిని దేవుడు కూడా రక్షిస్తాడు. దేవుడి రక్షణకు భక్తులు పూనుకోవాల్సిన సమయం కూడా ఆసన్నం అవుతున్నది.

మహా సంప్రోక్షణం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాల వారు తిరుమల గిరులకు భక్తులను 8 రోజుల పాటూ అనుమతించబోం అంటూ చేసిన ప్రకటనలు సృష్టిస్తున్న ప్రకంపనలు అంతా ఇంతా కాదు. ఈ వ్యాఖ్యల ప్రభావం.. భక్తుల మీద తీవ్రంగా పడుతోంది. టీటీడీ కూడా అనేక విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది. హిందూ మత పెద్దలు, పీఠాధిపతులు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆలయ భద్రత, స్వామి వారికి జరగగల అపచారాల గురించి వారు కూడా కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నారు.

మహా సంప్రోక్షణ సమయంలో ఏకంగా ఎనిమిది రోజుల పాటూ ఆలయాన్ని మూసివేయడం అనేది హిందువుల, భక్తుల మనోభావాలను కించపరచడమే... అంటూ విశాఖలోని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. రుషికేశ్ నుంచి ఈ అంశంపై స్పందించడం విశేషం. కంచి, శృంగేరి వంటి పీఠాధిపతులతో, వైఖానస ఆగమ పండితులతో మరింత లోతుగా చర్చించి ఈ విషయంలో టీటీడీ నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆలయాన్ని కంప్లీట్ గా మూసివేయడం వెనుక ఏదైనా కుట్ర దాగిఉన్నదా అనే అనుమానాలను కూడా స్వరూపానందేంద్ర వ్యక్తం చేశారు. మూసివేత సమయంలో సీసీకెమెరాలను కూడా ఆపు చేస్తాం అని ప్రకటించడం పట్ల ఆయన విస్మయం అనుమానం వ్యక్తం చేశారు.

అయితే అసలే.. ఆభరణాలను మాయం చేశారని, గుప్త నిధులకోసం పోటులో తవ్వకాలు చేశారని ఇటీవలి కాలంలో ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. అలాగే..  టీటీడీలోని పెద్దల సహకారంతో.. కొందరు రాజకీయ నాయకులు తిరుమలలోనే తాంత్రిక పూజలు చేయించడం కూడా జరుగుతోందనే విమర్శలూ ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో భక్తులను అనుమతించకుండా.. గుడిని మూసేస్తే ఇంకా ఏమైనా జరిగే ప్రమాదం కూడా ఉన్నదని పలువురు భయపడుతున్నారు.

ఆలయం మూసివేయవచ్చు గానీ.. తిరుమలకు భక్తులు రాకుండా.. అడ్డుకోరాదనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. భక్తులు తిరుమలకు చేరుకుని.. శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తాం అని ప్రకటించే రోజుల్లో కాపు కాయాలని, అర్చకులు మినహా సంఘవిద్రోహక శక్తులు ఆలయంలోకి ప్రవేశించకుండా చూస్తుండాలని.. స్వామికి, ఆలయానికి అపచారం జరగకుండా... జాగ్రత్త పడాలని పలువురు భావిస్తున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?