Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

నిఖా అయిపోయాక వరిస్తున్న ‘ఉత్తమ ప్రేమ’!

నిఖా అయిపోయాక వరిస్తున్న ‘ఉత్తమ ప్రేమ’!

తెలంగాణ రాజ్యసభ ఎన్నికల్లో ఓ ట్విస్టు చోటు చేసుకుంటున్నది. ఇక్కడ ఉన్న బలాబలాల ప్రకారం.. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న మూడు స్థానాలను తెరాసనే గెలుచుకోవాలి. కానీ.. తమకు ఉన్నది కేవలం 12సీట్ల బలమే అయిన్పటికీ.. కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిని మోహరిస్తున్నది. తన అభ్యర్థిత్వాన్ని పీసీసీ, ఏఐసీసీ ఖరారు చేశాయని.. సోమవారం నామినేషన్ వేస్తున్నానని బలరాం నాయక్ ప్రకటించారు.

అయితే ట్విస్టు ఏమిటంటే.. కాంగ్రెసు పార్టీకి బలం లేదు గానీ.. 7సీట్లు ఉన్న మజ్లిస్ ను తాము మద్దతు అడుగుతాం అని కాంగ్రెస్ అంటోంది. మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ.. కాంగ్రెస్ ను ఇక జీవితంలో నమ్మే అవకాశమే లేదని ఎన్నడో ప్రకటించారు. తాజాగా రాజ్యసభ ఎన్నికలలో తెరాసకు మద్దతివ్వనున్నట్లు కూడా ప్రకటించారు. అయినా సరే.. వారిని మద్దతు కోసం అడుగుతాం అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన చేయడం చిత్రమైన సంగతి.

ఒకసారి తెరాస-మజ్లిస్ బంధం చాలా పటిష్టంగా ఏర్పడిపోయింది. మజ్లిస్ ను అవసరానికి మించి నెత్తిన పెట్టుకుంటూ.. తెరాస వారికి వీసమెత్తు అపకారం జరగకుండా.. బంధం చెడకుండా కాపాడుకుంటూ వస్తోంది. అలాంటిది.. ఉత్తమ్ అడిగాడు కదాని.. ఒవైసీ ఎందుకు ఒప్పుకుంటారు.. అయినా అంత  పిచ్చిగా తమ శత్రు పార్టీ మద్దతు ఇస్తుందని ఆయన ఎలా నమ్మారు అని జనం నవ్వుకుంటున్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ మించిపోయింది లేదని.. ఇంకా నామినేషన్ వేయలేదు గనుక.. ఊరుకుంటే కనీసం పరువు దక్కుతుందని కూడా పలువురు అంటున్నారు. అయినా పరువు పోగొట్టుకోదలచుకున్న తె-కాంగ్రెస్ కు ఇలాంటి హితవాక్యములు చెవికెక్కుతాయో లేదో సందేహమే.

-కపిలముని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?