Advertisement

Home > Articles - MBS
ఎమ్బీయస్‌: మహారాష్ట్రలో ల్యాండ్‌ పూలింగ్‌

అమరావతిలో ల్యాండ్‌ పూలింగ్‌ తగాదాలు చాలాకాలంగా వింటున్నాం. దాన్ని చూసైనా యితర రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు తమాయించుకోవాలి. కానీ అలాటి ఛాయలేమీ కనబడటం లేదు.  సాటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణ నేర్చుకోలేదు, మరి మహారాష్ట్ర ఎందుకు నేర్చుకుంటుంది? నితిన్‌ గడ్కరీ మహారాష్ట్ర పబ్లిక్‌ వర్క్స్‌ మంత్రిగా వుండి ముంబయి-పుణే హైవే కట్టి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఫడ్ణవీస్‌ అంతకు మించిన పేరు తెచ్చుకోవాలని రూ.46 వేల కోట్ల బజెట్‌తో, 710 కిమీ.ల పొడుగు, 120 మీ.ల వెడల్పుతో 8 లేన్ల ముంబయి-నాగపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే తలపెట్టి ఆరు అంతర్జాతీయ కంపెనీలకు ఆ పని అప్పచెప్పాడు.

ఈ హైవేపై వాహనాలు 150 కిమీ.ల వేగంగా వెళతాయని, దానివలన ముంబయిని చేరడానికి ప్రస్తుతం 14 గంటలు పడితే, అప్పుడు 6-7 గంటల్లోనే చేరతాయని చెప్తున్నారు. 10 జిల్లాలు, 30 తాలూకాలు, 352 గ్రామాల ద్వారా వెళ్లే యీ 'మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌' వలన వెనుకబడిన విదర్భ, మరాట్వాడా ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఫడ్ణవీస్‌ ఆశలు చూపుతున్నాడు. 2019 చివరి కల్లా పూర్తయ్యే ఈ హైవేకి పక్కగా 24 స్మార్ట్‌ సిటీలు కడతామని వాటిలో ఆగ్రో ఇండస్ట్రియల్‌ పార్కులు, ఐటీ పార్కులతో సహా అన్నీ కడతామని, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులు ముంబయిలోనే కాదు, అక్కణ్నుంచి ముంబయి-ఆగ్రా హైవే మీదుగా యితర రాష్ట్రాలలో కూడా అమ్ముకుని బాగుపడవచ్చని, దీని వలన 2 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెప్తున్నాడు.

ఇంత చెప్తున్నా, యీ 352 గ్రామాల్లో 40% గ్రామాల ప్రజలు యీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేశారు. 4 వేల రైతు కుటుంబాలు సమృద్ధి కారిడార్‌ సంఘర్ష్‌ సమితి పేర సంఘంగా ఏర్పడి ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. వేలాదిమంది రైతులు సమృద్ధి మహామార్గ షేత్కారీ సంఘర్ష్‌ సమితి పేర ఏప్రిల్‌లో ముంబయి-ఆగ్రా హైవేను దిగ్బంధం చేశారు. మే నెలలో నాశిక్‌ జిల్లాలోని సిన్నార్‌, ఇగత్‌పూరి తాలూకాల రైతులు భూసేకరణ చేపట్టిన మహారాష్ట్ర స్టేట్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ జిల్లా ఆఫీసు ఎదుట నిరసన తెలిపారు.  తమ భూములు కొలవడానికి వచ్చిన అధికారులను నిలవరించడానికి ఒకళ్లిద్దరు రైతులు విషంతాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఎందువలన యీ ప్రతిఘటన?

ఎందుకంటే దీనికోసం 20,820 హెక్టేర్ల భూమిని సేకరించడానికి పూనుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం. దీనిలో హైవేకు కావలసినది 8,520 హెక్టేర్లు మాత్రమే. తక్కిన 12 వేల చిల్లర అదిగో ఆ 24 స్మార్ట్‌ సిటీలు అభివృద్ధి చేయడానికట. సేకరించవలసిన భూమిలో 80%, అనగా 17500 హెక్టేర్లు వ్యవసాయభూమి.  2922 హెక్టేర్లు ఉపయోగంలో లేని భూమి, 399 హెక్టేర్లు అటవీప్రాంతం. అటవీప్రాంతం విషయంలో ఫడ్ణవీస్‌కు అంత చింత లేదు. ఎందుకంటే కేంద్ర పర్యావరణ శాఖ యీ మధ్య పరిశ్రమలు వస్తాయంటే చాలు పర్యావరణం గురించి మరీ వర్రీ కావటం లేదని వాధ్వాన్‌లో నౌకాశ్రయానికి అనుమతి యిచ్చినపుడే తెలిసింది.

ఆ పోర్టును ప్రతిఘటించిన పర్యావరణ పరిరక్షణ అథారిటీని మూసేసింది తప్ప అనుమతి ఆపలేదు. అందువలన చిక్కల్లా వ్యవసాయభూమి సేకరించడంలోనే వుంది. 2013 నాటి రైట్‌ టు ఫెయిర్‌ కాంపెన్సేషన్‌ అండ్‌ ట్రాన్స్‌పరెన్సీ యిన్‌ లాండ్‌ ఎక్విజిషన్‌, రిహేబిలిటేషన్‌ అండ్‌ రీసెటిల్‌మెంట్‌ చట్టం కింద రైతుల అనుమతి తప్పనిసరి. వాళ్లకు మార్కెట్‌ రేటుకి తీసిపోని నష్టపరిహారం ఒక్కసారిగా యివ్వాలి. అది రాష్ట్రప్రభుత్వానికి యిష్టం లేదు. అందువలన మహారాష్ట్ర ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ చట్టం కింద తీసుకుందామని చూస్తోంది. ఒన్‌టైమ్‌ సెటిల్‌మెంటా లేక లాండ్‌ పూలింగా ఏది కావాలి అని అడుగుతోంది. 

లాండ్‌ పూలింగ్‌లో ఏదో ఒక అథారిటీ చిన్నా, చితకా రైతుల నుంచి పొలాలు తీసుకుని హైవే కట్టే ఏజన్సీకి కట్టపెట్టేస్తుంది. ఆ ఏజన్సీ ఆ భూమిని అభివృద్ధి పరచాక దానిలో కొంత శాతాన్ని అదే ప్రాంతంలో రైతులకు యిస్తానంటుంది. సాగు చేయని భూమి విషయంలో తీసుకున్నదానిలో 25% వెనక్కి యిస్తామని, సాగుచేసే భూమిలో అయితే 30% యిస్తామని అంటోంది. ఈ లోగా పదేళ్లపాటు ఏటా కొంతమొత్తం యిస్తామంటోంది. వినడానికి బాగానే వున్నా రైతులు దీన్ని నమ్మటం లేదు. దేశంలో మిగతా భాగాల్లో సెజ్‌ల విషయంలో యిలాటి మాటలు నమ్మి మోసపోయిన రైతుల సంగతి వాళ్లు వినివున్నారు. మహారాష్ట్రలో కూడా అనేక అనుభవాలున్నాయి. 

ఔరంగాబాద్‌ జిల్లాలో మహారాష్ట్ర ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ చికల్‌ఠాణా, వాలుంజ్‌ ప్రాంతాల్లో 1990లలో ఎకరా 4 వేల రూ.ల చొప్పున  భూమి సేకరించింది. చికల్‌ఠాణాలో రెండు షాపింగ్‌ మాల్స్‌ కట్టి ఓ వ్యాపారస్తుడికి అమ్మింది. ఇప్పుడది ఎకరా కోటి రూ.లు పలుకుతోందిట. భూములిచ్చి 25 ఏళ్లు దాటినా నష్టపరిహారం అందని భూయజమానులు యింకా వున్నారుట.

ముంబయికి ఉత్తరాన వున్న పాల్ఘార్‌ జిల్లా రైతులు ముంబయి-వడోదరా ఎక్స్‌ప్రెస్‌ హైవే కోసం, ముంబయి-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు కోసం జరుగుతున్న భూసేకరణను అడ్డుకుంటూ జూన్‌ నెలలో ప్రదర్శనలు నిర్వహించారు. వాధ్వాన్‌లో కట్టబోతున్న పెద్ద నౌకాశ్రయాన్ని అక్కడి స్థానికులు అడ్డుకుంటున్నారు. పుణె వద్దనున్న చకాన్‌ రైతులు అక్కడ కట్టబోతున్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ముంబయికి దక్షిణాన వున్న రాయగఢ్‌ జిల్లాలో ముంబయి-దిల్లీ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ కోసం సాగుతున్న భూసేకరణను అడ్డుకుంటున్నారు. 

ఈ హైవే విషయంలో భూములివ్వడానికి నిరాకరిస్తూ ఆందోళన చేస్తున్న రైతులే కాదు, గతంలో భూములిచ్చిన రైతులు సైతం అధికారులు పోలీసు బలగాలతో వచ్చి తమ చేత బలవంతంగా ఒప్పందపత్రాలపై సంతకాలు పెట్టించుకున్నారని ఆరోపిస్తున్నారు. 'పోలీసులు వెంట వెళ్లినది, అసాంఘిక శక్తుల నుంచి అధికారులకు రక్షణ కల్పించడానికి తప్ప ప్రజలను బెదరగొట్టడానికి కాదు' అంటోంది ప్రభుత్వం. నష్టపరిహారం విషయంలో అబద్ధాలు చెప్పి సంతకాలు తీసుకున్నారని కొందరి ఆరోపణ. 2013 చట్టం ప్రకారం పరిహారం నిర్ణయించడానికి ఓ ఫార్ములా వుంది.

గత మూడేళ్లగా జరిగిన అత్యధిక సేల్స్‌డీడ్స్‌లోని మొత్తాల సరాసరిని  రెడీ రికనర్‌ రేట్‌గా తీసుకుని, దానికి నాలుగు రెట్లు పరిహారంగా చెల్లించాలి. అది మార్కెట్‌ రేటు కంటె దాదాపు 20% ఎక్కువగా వుంటుంది అంటారు అధికారులు. రైతులు యీ వాదనను అంగీకరించటం లేదు. 'గత రెండేళ్లగా ప్రభుత్వం రెడీ రికనర్‌ రేట్‌ను 25% పెంచుతూ వచ్చింది. ఈ ప్రాజెక్టు ఆలోచన వచ్చినదగ్గర్నుంచి కేవలం 6% మాత్రమే పెంచింది. దాన్ని బట్టే తెలుస్తోంది, తక్కువ పరిహారంతో సరిపెడదామని ప్రభుత్వం చూస్తోందని' అంటున్నారు రైతులు. ఇక భూమిని అభివృద్ధి చేసి వాటా యిచ్చే ఆప్షన్‌ గురించి 'మాకు వచ్చినది వ్యవసాయం చేయడం మాత్రమే.

భూములిచ్చేసిన తర్వాత మేమేం చెయ్యాలి? వాళ్లు ఎప్పటికి డెవలప్‌ చేస్తారో, ఎప్పుడు యిస్తారో, అప్పటిదాకా ఏం చేయాలి? మా అందరికీ ఫిట్టర్లగా, వెల్డర్లగా తర్ఫీదు యిచ్చి తను కట్టబోయే యిండస్ట్రియల్‌ పార్కుల్లో ఉద్యోగాలు యిప్పిస్తానంటోంది ప్రభుత్వం. బ్లూ కాలర్‌ వర్కర్లుగా పనిచేయాల్సిన అవసరం మాకేమిటి? 24 స్మార్ట్‌ సిటీలు కడతామని చెప్తున్నారు. ఇప్పటిదాకా 6 వాటికి మాత్రమే భూసేకరణ జరిగింది. తక్కినవాటికి ఎప్పుడవుతుంది? ఎప్పుడు కడతారు? అక్కడ పరిశ్రమలు ఎప్పుడు వస్తాయి? మాకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? ఆ మబ్బుల్లో నీళ్లు చూసి మా కుండల్లో నీళ్లు ఒంపుకోవాలా?' అని అడుగుతున్నారు వాళ్లు.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmail.com