Advertisement

Advertisement


Home > Articles - MBS

సినీ స్నిప్పెట్స్‌ - పింగళి ఆఖరి రోజులు

సినీ స్నిప్పెట్స్‌ - పింగళి ఆఖరి రోజులు

పింగళి నాగేంద్రరావు గారిది బందరు. ''రారాజు'', ''వింధ్యరాణి'' అనే నాటకాలు రాసి చాలా పాప్యులర్‌ అయ్యారు. ''తారుమారు'' (1942) అనే సినిమాకు పింగళి మాటలు, పాటలు రాశారు. ''వింధ్యరాణి'' (1948)కి కూడా రాస్తే అది ఫెయిలయింది. అపజయంతో యింటికి తిరిగి వెళ్లాలాని సంశయిస్తూ వుంటే బందరు వారే అయిన కమలాకర కామేశ్వరరావు ఆయన్ని కెవి రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. కెవికి ఎప్పుడూ ఎక్స్‌క్లూజివ్‌ రైటరు కావాలి. ''భక్త పోతన'' ''యోగి వేమన''లకు సముద్రాలే రైటరు. తర్వాత ఆయనకు మంచి పారితోషికాలతో బయట నుంచి ఆఫర్లు వస్తూ వుంటే ''ఫ్రీ లాన్సర్‌గా ఏ సినిమాల కయినా రాసుకో'' అని పంపించి వేశారు. తను తీయబోయే జానపద చిత్రానికి తన కోసమే పనిచేసే రైటర్‌ ఎవరైనా వున్నారా అని వెతుకుతూంటే పింగళి పరిచయమ్యారు. ఆయనతో ''గుణసుందరి కథ'' రాయించుకున్నారు. అది హిట్‌. ఆ తర్వాత ''పాతాళభైరవి''. అదీ హిట్‌. ఇక కెవికి ఆయన పర్మనెంటు రైటరు అయిపోయారు. ఆయన సొంత సినిమాలు ''శ్రీకృష్ణార్జున యుద్ధం'', ''పెళ్లినాటి ప్రమాణాలు'', ''భాగ్యచక్రం''కు కూడా ఆయనే రాశారు. 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2015)

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?