Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : వినోద్‌ మెహతా - 13

ఎమ్బీయస్‌ : వినోద్‌ మెహతా - 13

ఇలాటిదేదో వస్తుందని వినోద్‌ ముందే వూహించాడు. ఎందుకంటే 1989 ఏప్రిల్‌లో రామకృష్ణ హెగ్డే అతన్ని ఓ రోజు డిన్నర్‌కు పిలిచి పేపరు చాలా బాగుందని మెచ్చుకుంటూనే మీ పబ్లిషరు దాని గురించి గర్వపడకపోవడం మాత్రం బాగాలేదన్నాడు. 'మీకెలా తెలుసు?' అని అడిగితే 'ఓసారి మేం యిద్దరం విమానంలో పక్కపక్కన కూర్చున్నాం. ఈ పేపరు వలన నాకు చాలా యిబ్బందులు వస్తున్నాయి. అమ్మేద్దామనుకుంటున్నానన్నాడు.' అని చెప్పాడు. ఇది జరిగిన నెలన్నరకు వినోద్‌కు విజయ్‌ నుండి ఓ లేఖ చేరింది - 'ఇటీవలి కాలంలో మన పేపర్లో వస్తున్న వార్తలు నాకు చాలా సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. ఆ వార్తలు నిజమోకావో మీకు తెలియాలి కానీ పాఠకులకు మాత్రం వూహాజనితంగా, అతిశయోక్తులతో నిండినట్లుగా అనిపిస్తున్నాయి. మన పేపరు విశ్వసనీయత దెబ్బతినేట్లు కనబడుతోంది. సంపాదకుడిగా మీ స్వేచ్ఛను నేను హరించే ఉద్దేశం లేకపోయినా, కింద యిస్తున్న నాయకుల గురించిన కథనాలు తాత్కాలికంగానైనా ఆపమని కోరుతున్నాను. లేకపోతే మన వ్యాపారప్రయోజనాలు దెబ్బ తింటాయి. నా పరిస్థితిని అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను.' అని రాసి వుంది. కింద యిచ్చిన జాబితా - ప్రధానమంత్రి, అమితాబ్‌ బచ్చన్‌, సతీశ్‌ శర్మ, లలిత్‌ సూరి, ధీరూభాయ్‌ అంబానీ, విపి సింగ్‌, మురళీ దేవ్‌రా, శరద్‌ పవార్‌.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2015)

mbsprasadgmail.com

Click Here For Previous Articles

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?