Advertisement

Advertisement


Home > Articles - Special Articles

బీచ్‌లో బికినీ లేకుండానా.? హౌ.. ఆ హౌ.!

బీచ్‌లో బికినీ లేకుండానా.? హౌ.. ఆ హౌ.!

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య పట్టణాల్లో ఒకటైన విశాఖపట్నంలో బీచ్‌ లవ్‌ ఫెస్టివల్‌ నిర్వహణకు రంగం సిద్ధమైన విషయం విదితమే. ఫిబ్రవరి 12, 13, 14 తేదీల్లో ఈ ఫెస్టివల్‌ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓ సంస్థ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఇప్పటికే ఆశ్రయించింది. ఆ మాటకొస్తే, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున సదరు సంస్థతో 'పెద్దల స్థాయిలో' సంప్రదింపులు జరిగాయన్న ప్రచారం జరుగుతోందనుకోండి.. అది వేరే విషయం. 

అయితే, ఇదంతా తూచ్‌.. అనేసింది అధికార తెలుగుదేశం పార్టీ. ప్రభుత్వం తరఫున ఇంతవరకు ఎలాంటి అనుమతులు ఆ ఫెస్టివల్‌కి ఇవ్వలేదని సాక్షాత్తూ మంత్రి కామినేని శ్రీనివాస్‌ చెప్పుకొచ్చారు. 'ప్రతిపాదనలు మాత్రమే వచ్చాయి..' అని సెలవిచ్చారాయన. ఇదే విషయమై టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, 'ప్రభుత్వానికీ, ఆ సంస్థకీ సంబంధం లేదు.. ఆ ప్రోగ్రామ్‌ ప్రభుత్వం డిజైన్‌ చేయించింది కాదు..' అంటూ గుస్సా అయ్యారు. 

ప్రతిపక్షం వైఎస్సార్సీపీ, బీచ్‌ లవ్‌ ఫెస్టివల్‌ పేరుతో విశాఖ ఇమేజ్‌ని భ్రష్టుపట్టిస్తారా.? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించేసరికి, పై విధంగా ప్రభుత్వం తరఫున టీడీపీ నేతలు, బీజేపీ నేతలు స్పందించారు. కానీ, ఇప్పుడు మాట మారింది. 'అబ్బే, ప్రభుత్వానికి సంబంధం లేదు..' అని చెప్పిన టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు, ఇప్పుడు ఆ ఫెస్టివల్‌ని అడ్డుకోవాలని ఎవరైనా చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించేశారు. 

ఇంతకీ, ఈ ఫెస్టివల్‌ని గోవాకి చెందిన సంస్థ నిర్వహిస్తోందా.? ప్రభుత్వమే దీన్ని నిర్వహిస్తూ, నిర్వహణ బాధ్యతల్ని సదరు సంస్థకు అప్పగించిందా.? అదంతా హంబక్‌, అసలు ఈ మొత్తం వ్యవహారానికి టీడీపీ స్పాన్సరర్‌ అనుకోవచ్చా.? ఇలా సవాలక్ష ప్రశ్నలు మళ్ళీ తెరపైకొస్తున్నాయి. 'అశ్లీలతకు తావు లేకుండా..' అంటూ బొండా ఉమామహేశ్వరరావు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బీచ్‌ లవ్‌ ఫెస్టివల్‌ అంటే, బీచ్‌లో అర్థనగ్నంగా డాన్సులు వేయడమే.. బీచ్‌లో టెంట్లు వేసేస్కుని, టూ పీస్‌ బికినీలతో ఎంజాయ్‌ చేయడమే.. ఇదేమీ ఇండోర్‌ ప్రోగ్రామ్‌ కాదు.. ఔట్‌ డోర్‌ ప్రోగ్రామ్‌. 

బీచ్‌ లవ్‌ ఫెస్టివల్‌లో బీచ్‌ లేకపోతే ఎలా.? బీచ్‌ ఎంజాయ్‌మెంట్‌ అన్నాక బికినీ లేకుండా ఎలా.? హౌ.. ఆ హౌ.?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?