Advertisement

Advertisement


Home > Articles - Special Articles

పిల్లల ఉసురు తీసింది చంద్రబాబేనా?

పిల్లల ఉసురు తీసింది చంద్రబాబేనా?

ఏపీలో గోదావరి నదిలో పడవ ప్రమాదాలు జరగడం, పెద్దలు, పిల్లలు ప్రాణాలు కోల్పవడం సర్వసాధారణమైపోయింది. అయినప్పటికీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు. ఈ మరణాలకు ఎవరు బాధ్యత తీసుకోవాలి? అని ప్రశ్నించుకుంటే ప్రభుత్వమే తీసుకోవాలనేది సమాధానం. ఇంకా చెప్పాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత తీసుకోవాలి.

తాజాగా గోదావరిలో జరిగిన పడవ ప్రమాదంలో కొందరు బతికి బయటపడగా, ఆరుగురు పిల్లలు గల్లంతయ్యారు. వారు ప్రాణాలతో ఉంటారునుకోలేం. వీరిలో ఇద్దరు పదో తరగతి పిల్లలు కాగా, మిగతావారు 4,6,8,9 తరగతుల పిల్లలు. చక్కగా చదవుకొని భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన ఈ పిల్లలు గోదారికి బలైపోయారు. హోం మంత్రి చినరాజప్ప సింపుల్‌గా మూడు లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించి చేతులు దులుపుకున్నారు.

ఏపీని సింగపూర్‌ చేస్తా, ప్రపంచంలోని ఐదు అద్భుత నగరాల్లో అమరావతి ఒకటి, బ్లూ గ్రీన్‌ సిటీ చేస్తా, సవాలక్ష హబ్‌లు చేస్తా, అది చేస్తా ఇది చేస్తా అంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు పడవ ప్రమాదాలపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు? తానే ప్రమాదాలకు కారకుడు అవుతున్నప్పుడు ఇంకెవరి మీద చర్యలు తీసుకుంటారు? లంక గ్రామాల్లో రోడ్లు, వంతెనలు ఎందుకు నిర్మించడంలేదు? అద్భుత అమరావతి ఒక్కటే ప్రధానమా?  

ఈ ప్రమాదానికి పరోక్షంగా బాబే కారకుడని ఎందుకు అంటున్నామంటే...రెండో శనివారం పాఠశాలకు సెలవు. చక్కగా ఎంజాయ్‌ చేయాల్సిన పిల్లలను వనం-మనం కార్యక్రమానికి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పాఠశాలలకు సెలవు రద్దు చేసి వనం-మనం కార్యక్రమానికి తరలించారు. లంక గ్రామాల్లోని ప్రజలకు ఎక్కడికి వెళ్లాలన్నా పడవలే గతి. వీరందరినీ పడవలో తీసుకెళుతుండగా, అది ప్రమాదానికి గురైంది.

ప్రచార కండూతి ఎక్కువగా ఉన్న చంద్రబాబు ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రభుత్వం తరపున చేసి ఆందోళన, నిరసన కార్యక్రమాలకు పాఠశాల విద్యార్థులను తరలిస్తుంటారు. ఎండలు మండిపోతున్నా వివిధ కార్యక్రమాలకు పిల్లలను తరలించిన సందర్భాలున్నాయి. చంద్రబాబు వెంట ఆయన పార్టీ నాయకులు, అధికారులు ఉంటారు కదా. చప్పట్లు కొట్టడానికి, తల బొప్పి కట్టే ఆయన ఉపన్యాసాలు వినడానికి వారు చాలరా? రవాణా సౌకర్యాలు, రోడ్లు, వంతెనలు లేని లంక గ్రామాల నుంచి పిల్లలను రప్పించడమెందుకు?

చంద్రబాబు అధికారంలోకి రాగానే గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 30 మంది చనిపోయారు. ఇందుకు బాబుగారి ప్రచార కండూతియే కారణం. ఈ ప్రమాదానికి కారకులెవరో తేల్చడానికి ఏకసభ్య కమిషన్‌ వేశారు. ఆ కమిషన్‌ ఏమైందో తెలియదు. కారకుడు చంద్రబాబేనని తెలుసు కాబట్టి కమిషన్‌ సైలెంట్‌ అయిపోయింది. పుష్కరాల్లో తొక్కిసలాట 2015 జులై 14న జరిగింది. సరిగ్గా మళ్లీ అదే రోజు 2018 జులై 14న పిల్లల ఉసురు తీశారు. ఈ రెండూ బాబుగారి కార్యక్రమాలే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?