cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Special Articles

మత చిచ్చు పెట్టడానికి చంద్రబాబు, పవన్, రాధాకృష్ణల తహతహ

మత చిచ్చు పెట్టడానికి చంద్రబాబు, పవన్, రాధాకృష్ణల తహతహ

నా మతం మానవత్వం. నా కులం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం..ఇది ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన విశేష ప్రకటన. నిజానికి ఒక ముఖ్యమంత్రి కులం గురించి మతం గురించిన విమర్శలకు సమాదానం చెప్పవలసి రావడం బాధాకరమే. అయినా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు కాని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాని, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేస్తున్న విష ప్రచారానికి జగన్ జవాబు ఇవ్వకతప్పలేదు. వేరే విమర్శలకు ఆస్కారం లేక, తన పాలనపై వేలెత్తి చూపలేక ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. ఈ పరిణామం ఊహించనిది కాదు. జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే  ఒక వ్యాసం రాశాను.  అందులో ప్రాంతీయ భావాలు, మత భావాలు రెచ్చగొడతారని  చాలా స్పష్టంగా చెప్పాను.

జగన్ తీసుకు వస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై విమర్శలు చేయలేని నిస్సహాయ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. అలాగే 151 సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీ ఉనికి ప్రశ్నార్దకంగా మారుతుందన్న భయం టిడిపిలోను ఆ పార్టీ అధినేత చంద్రబాబులోను బాగా పెరిగిపోయింది. దాంతో ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో టిడిపి నేతలు మతం, అని కులం అని విషం చిమ్మడం ఆరంభించారు. అందుకు ఆంధ్రజ్యోతిని ప్రధాన వేధికగా మార్చుకున్నారు. ఉన్నా, లేకపోయినా చెత్త అంతా రాసి జనం మీదకు వెదజల్లడం ఆరంభించారు. మొదట గోదావరి జలాలను రాయలసీమకు తరలించాలన్న సంకల్పంపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ లు సమాలోచనలు చేశారు. అంతే.. ప్రాంతీయ విద్వేషాలు ప్రచారం ఆరంభించేశారు. 

కెసిఆర్ కు జగన్ ఏపీని తాకట్టు పెట్టేస్తున్నాడని, లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ ఖర్చు పెట్టేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఏపీలో ప్రజలలో వ్యతిరేకత తీసుకురావడం ద్వారా జగన్ కు నష్టం చేయాలని విశ్వయత్నం చేశారు. కాని అది సఫలం కాలేదు. దానికి తోడు జగన్ తెలంగాణ భూభాగం నుంచి గోదావరి జలాల తరలింపు ఆచరణ సాధ్యంకాదని నిర్ణయానికి వచ్చి పోలవరం నుంచే గోదావరి జలాలను సీమకు తీసుకు వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చారు. దాంతో ఆ ప్రాంతీయ విద్వేషాల రెచ్చగొట్టే అవకాశం లేకుండా పోయింది. ఇక మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా హిందూ ఓట్ల పోలరైజేషన్ తేవాలని కుట్రలకు తెరదీశారు. అంతే ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా, జరగకపోయినా, దానిని అంతటిని జగన్ కు, క్రిస్టియానిటికి ముడిపెట్టి విష ప్రచారం ఆరంభించారు. 

టిటిడి వెబ్ సైట్ కు ఏదో ఒక పదం వచ్చి లింక్ అయిందట. అంతే వెంటనే గొప్ప అవకాశం వచ్చిందని రాధాకృష్ణ భావించారు. తక్షణమే బ్యానర్ కథనాలను వండి వార్చారు. తద్వారా తన వికృత స్వరూపాన్ని సమాజానికి తెలియచేశారు. గతంలో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలే రాధాకృష్ణ చేశాడు. అప్పటికన్నా రెట్టింపు వేగంగా, నాలుగు రెట్ల అధికంగా దుర్మార్గపు అబద్దపు ప్రచారానికి ఆయన నడుం కట్టారు. రాధాకృష్ణ ఏదో చెత్త రాస్తారు. దానిని వెంటనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు అందుకుంటారు. లేదా వారు మందు లీక్ ద్వారానో, మాట్లాడమో చేస్తారు. దానిని అత్యంత ప్రముఖంగా రాధాకృష్ణ రాస్తాడు. ఇది నిత్యం ఏపీలో జరుగుతున్న తంతు.

తాజాగా పవన్ కళ్యాణ్ కూడా చేసిన ఆరోపణలు చూడండి. జగన్ మతం గురించి మాట్లాడతారని ఆయన ఆరోపించారు. నిజానికి జగన్ ఇన్నేళ్ల రాజకీయంలో ఎన్నడూ ఆ గొడవలలోకి వెళ్లలేదు. ఆ ప్రయత్నం 2014 ఎన్నికల సమయంలో ఎవరు చేసింది పవన్ కళ్యాణ్ కు తెలియదా? కాకపోతే ఆత్మవంచన చేసుకుని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. చంద్రబాబు అయితే ఆయనకు అబద్దాలు అలవోకగా చెప్పడం అలవాటే కనుక దాని గురించి ప్రత్యేకించి మాట్లాడుకోనవసరం లేదు. కాని మీడియాగా బాధ్యతగా ఉండవలిసిన జ్యోతి పత్రిక మాత్రం అరాచకంగా మారుతోంది. ఒక ప్పుడు కులం పేరు రాయాలన్నా, మతం ప్రస్తావన తేవాలన్నా ఒకటికి, రెండుసార్లు జాగ్రత్తపడేవారం. కాని ఇప్పుడు అసలు అలాంటి పరిస్థితి లేదు. ఏ మాత్రం చిన్న అవకాశం వచ్చినా, జగన్ ప్రభుత్వంపై వీలైనంత బురద జల్లి చంద్రబాబుకు రాజకీయంగా ఒక కీలుబొమ్మగా మారడానికి ఆయన సిద్దం అయ్యారు. 

తెలుగుదేశం మీడియాగా ఈ పత్రికలు ఇలాంటి ప్రయత్నాలు చేయవని ఎవరూ అనుకోలేదు. కాని మరి ఇంత నీచంగా బరి తెగిస్తాయని అనుకోలేదు. జగన్ చేపట్టిన వివిధ స్కీములకు వ్యతిరేకంగా ప్రచారం చేసే ధైర్యం ఈ మీడియాకు లేదు. అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు కూడా లేదు. అందుకే ఇలాంటి దిక్కుమాలిన ప్రచారానికి తెగబడుతున్నారు. ఇదే పత్రిక చంద్రబాబు టైమ్ లో ఆర్టీసీ టిక్కెట్ల పై క్రైస్తవ, ముస్లిం ప్రచారం చేస్తూ జెరుసలెం వెళ్లండి, మక్కా వెళ్లండి అని ప్రచారం చేసినా ఏమాత్రం ఫీల్ కాలేదు. టిడిపి హయాంలో టిటిడిలో అన్య మత ఉద్యోగులు ఉన్నా తప్పుగా అనిపించలేదు. చంద్రబాబు క్రైస్తవుల సమావేశానికి వెళ్లి క్రీస్తును నమ్మితే అన్ని విజయాలే అని ప్రచారం చేసినా ఆక్షేఫణగా కాని క్రైస్తవ ప్రచారంగా కనిపించలేదు.

అదే జగన్ అధికారంలోకి రాగానే పట్టపగ్గాలు లేకుండా రాయడం ఆరభించారు. ఇదంతా ఊహించినందే. కనుక జగన్ ఇప్పుడు చెప్పిన సమాధానం చాలా స్పష్టంగా ఉంది. వాళ్లకు ఆయన సరైన జవాబే ఇచ్చారు. జగన్ తన మాటకు కట్టుబడి పార్టీలు చూడను, మతం చూడను, కులం చూడను, ప్రాంతం చూడను అంటూ ఏదైతే ప్రమాణ స్వీకారం రోజున చెప్పారో దాని ప్రకారమే తన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకు వెళ్లడమే మార్గం. ఎందుకంటే వీళ్లు ఎంత విష ప్రచారం చేసినా, ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి కనుక.

కొమ్మినేని శ్రీనివాసరావు 

 


×