Advertisement

Advertisement


Home > Articles - Special Articles

హైదరాబాద్ లో ఆగని తలాక్ లు..

హైదరాబాద్ లో ఆగని తలాక్ లు..

వివాహం అయిన నాలుగు నెలలకే తలాక్ ను పోస్టులో పంపిన ప్రబుద్దుడు. తలాక్ ఇది ముస్లీం మహిళల జీవితాలను చిన్నా భిన్నం చేస్తున్నాయి. ఇది గ్రహించిన ప్రభుత్వం తలాక్ పైన చట్టం తీసుకుని వచ్చింది. తలాక్ అని చెప్పేసి ముస్లీం మహిళ జీవితాలు చిన్నా భిన్నం కాకుండా వుండేందుకు ప్రభుత్వం చట్టం తీసుకుని వచ్చింది. ప్రభుత్వం ఇన్ని చేసిన కూడా హైదరాబాద్ వాసులు మాత్రం ఈ చట్టంను పట్టించుకోవడం లేదు.

త్రిపుల్ తలాక్ స్వేచ్చగా ఇచ్చి వేస్తున్నారు. పాతబస్తీలోని ఒక ప్రబుద్దుడు ఏకంగా పొస్టులో తన భార్యకు త్రిపుల్ తలాక్ అంటూ పంపించాడు. ఈ తలాక్ పైన పోలీసులను ఆశ్రయించింది మహిళ.. పాతబస్తీలోని రెయిన్ బజార్ కు చెందిన బేగంకు ఖాదిర్ తో వివాహాం జరిగింది. గత ఏడాది డిసెంబర్ 17వ తేదిన వీరి వివాహాం జరిగింది. 

బేగం తండ్రి ఒక్క చిరు వ్యాపారి. తనకు తెలిసిన మరొక చిరు వ్యాపారి కుమారుడికి ఇచ్చి వివాహాం చేశాడు ఇక్కడ వరకు బాగానే వుంది. అసలు విషయం ఎంటి అంటే వివాహాం చేసుకున్న ఖాదిర్.. కొన్నాళ్లు పాటుగా బేగంతో కాపురం చేశాడు. ఒక్క ఫైన్ మార్నింగ్ పుట్టింటికి పొమ్మిని చెప్పాడు. అయితే ఎందుకు అని అడగకుండానే బేగం తన పుట్టింటికి వెళ్లిపొయింది. 

తనను వచ్చి తన భర్త తీసుకుని పొతాడని ఎదురు చూస్తుంది. గత నెలరోజుల నుంచి తన భర్త కొరకు ఎదురు చూసింది. తాను ఇంటికి వస్తానని చెప్పింది. ఖాదిర్ మాత్రం ఇప్పడే కాదు కొన్నిరోజుల పాటుగా మీ పుట్టింటిలోనే వుండాలని చెప్పాడు.. ఇలా చెప్పి వారంరోజులు గడవక ముందే సడెన్ గా రెండురోజుల క్రితం పొస్టులో తలాక్ నామా పత్రంను పంపించాడు ఖాదిర్.

ఈ తలాక్ చూసి షాక్ గురైన బేగం తల్లిదండ్రులు వెంటనే ఖాదిర్ కుటుంబాన్ని కాంటాక్ట్ చేశారు. తమ కొడుకుకు మీ కూతురు ఇష్టంలేదు అందుకనే తలాక్ ను పంపించాడని చెప్పారు. తనకు తలాక్ ఎందుకు పంపావని ఖదీర్ ను బేగం అడిగితే తనకు నీవు ఇష్టంలేదని చెప్పి ఫోన్ కట్ చేశాడు. పోస్ట్ లో తలాక్ పంపడంతో అవాక్కైన బేగం వెంటనే రెయిన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ఆరంభించారు. ప్రసుత్తానికి పరారీలో వున్న ఖాదిర్ తో పాటుగా కుటుంబ సభ్యుల కొరకు గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?