Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ప్రియుడికి లైవ్ చూపిస్తూ ప్రియురాలు ఆత్మహత్య

ప్రియుడికి లైవ్ చూపిస్తూ ప్రియురాలు ఆత్మహత్య

ఉన్నత చదువు కొరకు హైదరబాద్ వచ్చిన ఒక యువతి ఆత్మహాత్య చేసుకుంది. ప్రియుడితో వీడియో కాలింగ్ లో మాట్లాడుతూ ఆత్మహాత్య చేసుకుంది. ఈ ఆత్మహాత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అనంతపురంకు చెందిన హానిషా చౌదరి ఉన్నత చదువు కొరకు హైదరబాద్ కు వచ్చింది.

నగరంలోని కొంపల్లిలో ఉన్న శివశివానీ కాలేజీలో చదువుకుంటోంది. హానిషా ఆత్మహాత్య చేసుకోవడం తీవ్రకలకలం చెలరేగుతోంది. ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్న హనీషా చౌదరి అనే అమ్మాయి కాలేజీ హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని తనువు చాలించింది. హనీషాది అనంతపురం జిల్లా. ఆమె తండ్రి పేరు బుగ్గయ్య చౌదరి.

ఆత్మహత్యకు ముందు హనీషా తన ప్రేమికుడు దక్షిష్‌ పటేల్‌తో వీడియోకాల్‌లో మాట్లాడింది. వీడియో కాల్‌లో అతను చూస్తుండగానే ఫ్యాన్‌కు ఉరేసుకుంది.. ఆస్పత్రికి చేరేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది.

ఆమె మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.. ఇదిలా వుంటే హానిషా ఆత్మహాత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మరొక వైపు గత రెండు సంవత్సరాల నుంచి కూడా హానిషా శివాణి హాస్టల్ వుంటూ ఎంబీఏ చేస్తోంది. ఆత్మహాత్యపైన కుటుంబ సభ్యులు కూడా నోరు మెదపలేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?