Advertisement

Advertisement


Home > Articles - Special Articles

'ఆనందం'గా ఢిల్లీ వరకు తొక్కేశాడు

'ఆనందం'గా ఢిల్లీ వరకు తొక్కేశాడు

కొందరు అంతే అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. హైదరాబాద్ కుర్రాడు ఆనంద్ గౌడ్ కూడా అలాంటోడే. రికార్డు సృష్టించాలనుకున్నాడు, సృష్టించేశాడు.

ఇంతకీ ఈ ఆనంద్ ఏం చేశాడో తెలుసా? హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాడు. ఇందులో రికార్డ్ ఏముంది? హైదరాబాద్ నుంచి ఢిల్లీ అందరూ వెళ్తారు కదా? ఆనంద్ మాత్రం అందరిలా ఢిల్లీ వెళ్లలేదు.. సైకిల్ తొక్కుకుంటూ దేశ రాజధాని వరకు వెళ్లిపోయాడు.

అవును.. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు 1550 కిలోమీటర్లు సైకిల్ పై వెళ్లాడు ఆనంద్. అది కూడా జస్ట్ వారం రోజుల్లో టాస్క్ పూర్తిచేశాడు. ఈ ఫీట్ సాధించడం కోసం 6 నెలల పాటు కష్టపడి ప్రాక్టీస్ చేశాడు ఈ హైదరాబాదీ. గంటకు 18 నుంచి 20 కిలోమీటర్లు అవలీలగా సైకిల్ తొక్కేశాడు. అలా రోజుకు 200 కిలోమీటర్లకు పైగా కవర్ చేస్తూ.. వారం రోజుల్లో ఢిల్లీకి చేరిపోయాడు.

ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుందని, దాన్ని బయటపెట్టాలని అంటున్నాడు ఆనంద్. నేటి యువతలో స్ఫూర్తి నింపేందుకే తను ఈ పని చేసినట్టు చెప్పుకొచ్చాడు. ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తన ఫీట్ కు స్థానం కల్పించాల్సిందిగా దరఖాస్తు చేసుకున్నాడు ఆనంద్.

అన్నట్టు ఈ కుర్రాడు, ఇంతకుముందే మరో రికార్డు నెలకొల్పాడు. హైదరాబాద్ నుంచి తిరుపతికి, 650 కిలోమీటర్లు మెల్లగా జాగింగ్ (స్లో జాగింగ్) చేస్తూ చేరుకున్నాడు. అలాఇండియన్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?