cloudfront

Advertisement

Advertisement


Home > Articles - Special Articles

నవ్వి పోదురుగాక..

నవ్వి పోదురుగాక..

కమ్మవారి చేత..కమ్మవారి కొరకు.కాపుల అండతో నడుస్తున్న కమ్మ ప్రభుత్వం అనే స్టేజికి చేరిపోతొంది తెలుగుదేశం పార్టీ సారథ్యంలోని ప్రభుత్వం. అయితే గడచిన రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడి వ్యవహారశైలికి, ఈ సారి వచ్చిన ప్రభుత్వానికి, బాబు వ్యవహారశైలికి చాలా తేడా కనిపిస్తోంది. అసలు ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కావడానికే రాష్ట్రంలోని కమ్మ సామాజిక వర్గం మనుటయో,,మరణించుటయో అన్న లెవెల్ లో పనిచేసారు. అంతకు ఏడాది ముందు నుంచే వెబ్ సైట్ లు, ఫేస్ బుక్ పేజీలు, సిద్దం చేసి, జగన్ కు వ్యతిరేకంగా ఎంత ప్రచారం సాగించాలో అంతా సాగించారు. రెడ్లు..కమ్మలు..ఇదే ఆఖరిసారి అన్నంతగా పోరాడారు. అదృష్టం కొద్దీ బాబుకు మోడీ అండ దొరికింది. దాంతో పాటు పవన్ తోడయ్యాడు. కాపులను చేరదీసారు. దీంతో విజయం వరించింది. అక్కడికి ఓ అంకం ముగిసింది.

అధికారం వరించిన దగ్గర నుంచి బాబు వైఖరి చాలా సష్టమైంది. కమ్మవారి కోసం ప్రభుత్వం అన్న రీతిలో ముందుకు పోతున్నారు. కీలకమైన అపాయింట్ మెంట్లను ఏరి కోరి కమ్మవారికి కట్టబెట్టడం ప్రారంభించారు. కాపుల్లో కొందర్ని ఏరి వారిని పదే పదే ముందుకు నెడుతూ, వారి పేర్లు పదే పదే వినిపించేలా చేస్తూ,  వారి అండ చేజారకుండా చూసుకుంటున్నారు. కానీ మరో పదేళ్ల వరకు రాష్ట్రంలో ఇంకో ప్రభుత్వం రాకూదన్నట్లు ఆయన ఎత్తుగడలు వేస్తున్నారు. కృష్ణా-గుంటూరు ప్రాంత అభివృద్ధే ధ్యేయం అన్నట్లు వ్వవహరిస్తున్నారు. పార్టీలో వున్న కాపులు కొందరికి కొంత వరకు ప్రాధాన్యం ఇవ్వడంతో మరి ఇంకెవరు గొంతు విప్పడం లేదు. కేంద్రంలో, రాష్ట్రంలో కీలక అధికారిక పదవులన్నీ కమ్మవారితో నింపేస్తున్నా, తమవారికి నాలుగైదు పదవులు ఇచ్చారు కనుక, మరి ఇంకెవరు కిమ్మనడం లేదు. 

మరోపక్క రాయలసీమను చాలా ప్లాన్డ్ గా వుంటే వుండండి...పోతే పోండి అనే స్టేజ్ కు తీసుకువస్తున్నట్లు కనిపిస్తోంది. ఎయిమ్స్ వంటి సంస్థలు కోస్తాకు లాగేయడం, రాజాధానిపై కేంద్రం నిర్ణయించిన కమిటీ వున్నా, తమ పని తాము చేసుకుపోవడం వంటి వాటితో బాబు దూసుకుపోతున్నారు. ఇప్పుడు రాయలసీమ వాసుల అసంతృప్తిని వినిపించే నాయకులు లేరు. వున్నావారిలో కొందరు కేసుల్లో, మరి కొందరు బాబు పార్టీలో ఇరుక్కున్నారు. దీంతో మరి వేరు మాట వినిపించడం లేదు. కెయి కృష్ణ మూర్తి లాంటి వాళ్లు కూడా ఆఫ్ ది రికార్డు మాట్లాడుతున్నారు తప్ప మరేమీ గట్టిగా అనలేకపోతున్నారు. అయినా ఇవేమీ బాబు పట్టించుకునే స్థితిలో లేరు. నారాయణ వంటి కాపునాయకులను మందుకు పెట్టి తమకు కావాల్సిన రీతిలోపాలన చేసుకుపోతున్నారు. తమకు అధికారం అందింది అది చాలు అని వారు భావిస్తున్నారు. తన ప్రాంతం నెల్లూరు గురించి నారాయణ ఒక్క మాట మాట్లాడిన దాఖలాలులేవు..ఆయన నోరు విప్పితే బెజవాడ, గుంటూరు. అలాగే నెల్లూరుకు చెందిన కేంద్ర మంత్రి వెంకయ్య నోరు విప్పితే గుంటూరు- విజయవాడ. బాబు సంగతి సరేసరి. 

ఇప్పుడు కార్పొరేట్లు అంతా కొత్త పథకలపైనే చూస్తున్నారు. ఎవరు ఏ విధంగా ప్రాజెక్టులు సంపాదించాలా అన్న ఉద్దేశంతో వున్నారు. సంపద సృష్టి, అభివృద్ధి అంటూ సామాన్యులకు కాకుండా, పై తరగతివారికి పనికొచ్చేవాటిపై నేతలు దృష్టి సారిస్తున్నారు. భారీ పర్యాటక ప్రాజెక్టులు, విమానాశ్రయాలు వీటిలో భాగమే.  ఫ్యాక్టరీలు వంటి వాటికన్నా ఇటువంటి ప్రాజెక్టులపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. భూముల వ్యవహారంలో వైఎస్ ను ఇప్పటికీ ఆడిపోసుకుంటూ, బాబు మాత్రం ఇవ్వాల్సినవారికి అనుమతులు ఇచ్చేసి, అదంతా ప్రజల కోసమే అని చెబుతున్నారు. విశాఖలో విప్రోకి ఇచ్చిన భూమిని సెజ్ గా మార్చుని వ్యాపారం చేసుకునేందుకు అనుమతి ఇచ్చేసారు. అలా కాకుండా విప్రోనే తీసుకున్న మేరకు డెవలప్ మెంట్ సెంటర్ పెట్టమని ఎందుకు అడగలేదు అన్నది తెలియదు. 

ఇలా ప్రతి నిర్ణయం చకచకా తీసేసుకుంటూ, తన మానాన తను ముందుకు పోతున్నారు. అడగడానికి పార్టీలో ఎవరూ ముందుకు రారు. అడిగే ప్రతి పక్ష నేత జగన్ ను అడ్డగోలుగా విమర్శించడం తప్ప సమాధానం చెప్పరు. బాబు కు తందాన తాన అనడం తప్ప, తొంభై శాతం మీడియా మరేమీ చేయదు. 

అందువల్ల అయిదేళ్లు ఇది ఇలా కొనసాగుతుందంతే. ప్రశ్నిస్తాం..అన్నవాళ్లు కూడా అప్పటిదాకా ఏమీ మాట్లాడరేమో? 

ఏం చేస్తాం..ఎవరి మొహమాటాలు వారివి..ఎవరి అవసరాలు వారివి..ఎవరి భయాలు వారివి.

మహేష్ ఙోకులు మామూలుగా వుండవు

టార్గెట్ 175.. కొడతారా? లేదా?