Advertisement

Advertisement


Home > Articles - Special Articles

పవన్‌ వ్యూహాత్మక రాజకీయ వైఫల్యం

పవన్‌ వ్యూహాత్మక రాజకీయ వైఫల్యం

పవన్‌కి అసలు రాజకీయ వ్యూహం అనేది ఏమైనా వుందా.? పోనీ, రాజకీయ వ్యూహం లేదనుకుంటే.. ప్రజల తరఫున పోరాడేందుకైనా ఆయన వద్ద అసలు వ్యూహం వుందా.? సిద్ధాంతాల మాటేమిటి.? దేశ భక్తి అంటాడు, ఇంకేదో చెబుతాడు. అంతలోనే, ఉత్తరాది అహంకారం.. అంటూ నిలదీసేస్తాడు.. నేను సీమాంధ్రకి పరిమితమవ్వాల్సి వచ్చిందా.? అని ప్రశ్నిస్తాడు. ఏవేవో మాట్లాడతాడు, దేంట్లోనూ క్లారిటీ కన్పించదు. చివరికి పవన్‌కళ్యాణ్‌ అంటేనే ఓ ప్రశ్న అనే భావన కల్గిస్తాడు. 

చిరంజీవే నయ్యం.. ముఖ్యమంత్రి కావాలనుకుని పార్టీ పెట్టాడు.. చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఓట్లు, సీట్లు సాధించాడు. ముఖ్యమంత్రి కాలేకపోయినా, అదేమీ అవమానకరమైన ఫలితం కాదు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. రాజకీయాల్లో తన బలమెంతో చిరంజీవికి అర్థమయిపోయింది. పార్టీని నడపలేక కాంగ్రెస్‌లో కలిపేశారు. ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చాలామంది కాంగ్రెస్‌లో కలిసిపోయారు. నేతలు ఎవరి దారి వారు చూసుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రాజ్యసభ అంటే అందరికీ తెల్సిందే కదా, రాజకీయాల్లోనే వుండాలని లేదు.. రాజకీయాలకు కాస్త దగ్గరగా వున్నట్లు కలరింగ్‌ ఇస్తే సరిపోతుంది. చిరంజీవి చేస్తున్నది అదే. 

సమాజాన్ని ఉద్ధరించేస్తాననే మాటలు చెప్పడం మానేశారు చిరంజీవి. తన పనేదో తాను చేసుకుపోతున్నారు. పవన్‌కళ్యాణ్‌ అలా కాదు, అప్పట్లో కాంగ్రెస్‌ నేతల పంచెలూడగొట్టేస్తానన్నారు.. ఆ తర్వాత బీజేపీ పంచెలో దూరారు. ఇప్పుడేమో ఆ బీజేపీపైనా దుమ్మెత్తిపోస్తున్నారు. మోసం చేయడం రాజకీయ పార్టీలకి అలవాటే, నన్ను మోసం చేశారు మొర్రో.. గగ్గోలు పెట్టడం, నూటికి నూరుపాళ్ళూ చేతకానితనమే. 

రెండేళ్ళకు నిద్ర మత్తు వదిలింది పవన్‌కళ్యాణ్‌కి. ఏమన్నా అంటే, అది నిద్ర కాదు.. ధ్యానం.. అంటాడాయన. పవన్‌కళ్యాణ్‌కి ధ్యానం చేసినా, ఫామ్‌ హౌస్‌లో సరదాగా వ్యవసాయం చేసుకున్నా చెల్లిపోతుంది. కానీ, ఆయన్ని నమ్మి టీడీపీ - బీజేపీలకు ఓట్లేసిన ప్రజల మాటేమిటి.? ప్రశ్నిస్తానంటాడు, ఏదేదో మాట్లాడతాడు. మీటింగులు పెడితే సరిపోతుందా.? ప్రజల తరఫున పోరాం చెయ్యక్కర్లేదా.? అంటే, ఎమ్మెల్యేలు.. ఎంపీలు వున్నారు కదా.. అని అతి తెలివి సమాధానమొకటి. వాళ్ళకు చేతకావట్లేదు కాబట్టే కదా, పవన్‌ మీటింగులు పెడ్తున్నది.. ఆ మీటింగుల్లో ఉద్యమకార్యాచరణ ప్రకటించాలి కదా. అదీ చేయడాయె. 

ఎట్నుంచి ఎటు చూసినా పవన్‌కళ్యాణ్‌ ఓ పెద్ద క్వశ్చన్‌ మార్క్‌. ఎందుకొస్తాడో తెలియదు, ఏం మాట్లాడతాడో అసలే తెలియదు. ఒక్కటి మాత్రం క్లియర్‌. పవన్‌ వ్యూహాత్మకంగా రాజకీయ వైఫల్యం చెందుతున్నాడు. వ్యూహాత్మకంగా.. అని ఎందుకు అనాల్సి వస్తోందంటే.. ఆయన వేదికలపై మాట్లాడే మాటలు అలా వుంటాయి మరి. తిరుపతి బహిరంగ సభ, కాకినాడ బహిరంగ సభ మాత్రమే కాదు, రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించినప్పుడూ.. ఈ కన్‌ఫ్యూజన్‌ క్లియర్‌గానే కన్పించింది. 

నన్నెవరూ నడిపించడంలేదు.. నాకు నేనే నడవగలను.. అని చెప్పే పవన్‌కళ్యాణ్‌ ప్రతి అడుగులోనూ, చంద్రబాబు కన్పిస్తారు.. ప్రతి మాటలోనూ చంద్రబాబు టోన్‌ కనిపిస్తుంటుంది. కాదని, పవన్‌ బుకాయిస్తే సరిపోతుందా.? చాన్సే లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?